Alcohol for Sleep: రాత్రి పడుకునే ముందు మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా?

|

Jul 09, 2024 | 12:27 PM

ఆరోగ్యకరమైన జీవనానికి సరిపడా నిద్ర కూడా అవసరం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో రకరకాల వ్యాధులు తలెత్తుతాయి. నేటి కాలంలో గజిబిజి జీవనశైలి కారణంగా చాలా మంది అధిక ఒత్తిడితో బతుకీడుస్తున్నారు. దీని కారణంగా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసువారు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం...

Alcohol for Sleep: రాత్రి పడుకునే ముందు మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా?
Alcohol For Sleep
Follow us on

ఆరోగ్యకరమైన జీవనానికి సరిపడా నిద్ర కూడా అవసరం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో రకరకాల వ్యాధులు తలెత్తుతాయి. నేటి కాలంలో గజిబిజి జీవనశైలి కారణంగా చాలా మంది అధిక ఒత్తిడితో బతుకీడుస్తున్నారు. దీని కారణంగా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసువారు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. అయితే చాలా మంది రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం వల్ల మద్యానికి బానిసలవుతున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందనే భ్రమలో గుడ్డిగా మత్తులో చిత్తవుతున్నారు. నిజంగా.. ఆల్కహాల్ సేవిస్తే హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుందా? అనే విషయాన్ని నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

ఢిల్లీలోని ధర్మశిలా నారాయణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డా గౌరవ్ జైన్ మాట్లాడుతూ.. మద్యం సేవించిన తర్వాత తేలికగా నిద్రపడుతుందని అందరూ భావిస్తారు. కానీ అది అస్సలు నిజం కాదు. దీర్ఘకాలిక మద్యపానం నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పడుకునే ముందు ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా నిద్రకు భంగం కలిగించవచ్చు. రాత్రి తర్వాత మరుసటి రోజంతా అలసటగా అనిపిస్తుంది.

పడుకునే ముందు మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఎంత ఆల్కహాల్ తాగుతారు.. ఎప్పుడు తాగుతారు.. ఏ సమయంలో తాగుతారు అనేవి మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. నిజానికి, మద్యం తాగినప్పుడు, అది త్వరగా మీ రక్తప్రవాహంలోకి శోషించబడుతుంది. కాలేయం దానిని పూర్తిగా జీవక్రియ చేయగలిగేంత వరకూ అది రక్తంలో ఉంటుంది. ఫలితంగా రాత్రిపూట గాఢ నిద్ర రావచ్చు. ఆల్కహాల్ సరిగ్గా జీవక్రియ చేయకపోతే, పదేపదే మెలుకువ వస్తుంది. అందుకే నిద్రకు ముందు మద్యం సేవించకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.