Sesame Oil: నువ్వుల నూనెతో అందం,ఆరోగ్యం.. జుట్టు ఒత్తుగా, నల్లగా వద్దంటే పెరుగుతుంది…!

నువ్వుల నూనెలో వివిధ పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఈ మూడు సమ్మేళనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టును లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతాయి. నువ్వుల నూనెను మీ జుట్టుకు అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. తలకు నువ్వుల నూనె రాసుకోవడం వల్ల స్కాల్ప్‌ హెల్త్‌ మెరుగుపడుతుంది. నువ్వుల నూనె తల చర్మం లోపలకి వెళ్లడంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

Sesame Oil: నువ్వుల నూనెతో అందం,ఆరోగ్యం.. జుట్టు ఒత్తుగా, నల్లగా వద్దంటే పెరుగుతుంది...!
Sesame Oil

Updated on: Nov 08, 2025 | 7:13 PM

నువ్వుల నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఈ నూనె తలకు రాసుకోవడం వల్ల స్కాల్ప్‌ హెల్త్‌ బాగుంటుంది. ఇన్ఫెక్షన్లు రావు. నువ్వుల నూనె తలకు రాయడం వల్ల యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. కురులు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వుల నూనె రాసుకోవడం వల్ల జుట్టు తెల్లగా మారడం వంటి సమస్యలు రావు. నువ్వుల నూనెలోని పోషకాలు జుట్టును నల్లగా ఉంచుతాయి.

గోరువెచ్చని నువ్వుల నూనె తలకు రాసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడి నూనె వల్ల జుట్టు రంధ్రాలు తెరుచుకుని, పోషకాలు ఈజీగా అందుతాయి. నువ్వుల నూనె తలకు రాసుకోవడం వల్ల జుట్టుకు పోషకాలు బాగా అందుతాయి. దీని వల్ల జుట్టు వేగంగా ఎదుగుతుంది. ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. నువ్వుల నూనె తలకు రాయడం వల్ల జుట్టుపై తేమ నిలిచి ఉంటుంది. దీని వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. ఇది తలలో ఇన్ఫెక్షన్, అనేక జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. అలాగే, ఈ నూనెను తలకు అప్లై చేయటం వల్ల జుట్టులో చుండ్రు సమస్య ఉండదు.

నువ్వుల నూనెను రెగ్యులర్‌గా తలకు రాయడం వల్ల కురులు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. నల్లని నిగారించే కురుల్ని పొందవచ్చు. నువ్వుల నూనెతో తలను మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. చివరలు చిట్లడాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేటప్పుడు జుట్టు ఆకృతిని కూడా మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ నూనె తలలో తేమను నిలుపుతుంది. చుండ్రును నివారిస్తుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. నువ్వుల నూనెను కొబ్బరి నూనె, ఆవ నూనె వంటి ఇతర నూనెలతో కలిపి కూడా ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us