హీరోయిన్‌ లాంటి నడుం కావాలా..? రోజు సాయంత్రం ఈ ఒక్క సింపుల్ ట్రిక్ పాటిస్తే సరి.. సన్నబడటం ఖాయం!

ప్రస్తుత కాలంలో గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చేసేవారిలో అత్యధికంగా వేధించే సమస్య... పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. ఎంత డైటింగ్ చేసినా, బరువు తగ్గినా పొట్ట దగ్గరి కొవ్వు (Belly Fat) మాత్రం అంత సులభంగా కరగదు. ముఖ్యంగా మహిళల్లో లోయర్ బెల్లీ భాగం ఎక్కువగా పెరగడం వల్ల శరీరం షేప్ అవుట్ అవుతుంది. దీనివల్ల నచ్చిన బట్టలు వేసుకోలేక ఎంతోమంది ఆందోళన చెందుతుంటారు. అయితే, ఎలాంటి కఠినమైన జిమ్ వర్కవుట్స్ లేకుండానే పొట్టను తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన, సహజసిద్ధమైన చిట్కా ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

హీరోయిన్‌ లాంటి నడుం కావాలా..? రోజు సాయంత్రం ఈ ఒక్క సింపుల్ ట్రిక్ పాటిస్తే సరి.. సన్నబడటం ఖాయం!
Belly Fat Reduction
Image Credit source: freepik

Updated on: Jun 09, 2026 | 12:00 PM

కూర్చుని ఉద్యోగాలు చేసేవారిలో పొట్ట చుట్టూ కొవ్వు చేరడం, బరువు పెరగడం సాధారణ సమస్య. ముఖ్యంగా మహిళల్లో లోయర్ బెల్లీ భాగం ఎక్కువగా పెరుగుతుంది. దీంతో వారు తరచూ ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటారు..కానీ, ఈ సమస్యకు ఒకే ఒక్క సింపుల్ హోమ్ రెమెడీ ఉంది. ఆ మ్యాజికల్ హ్యాక్ ఏమిటంటే.. రాత్రి భోజనం త్వరగా చేయడం. అవును.. పెరిగిన పొట్టను ఫ్లాట్‌గా మార్చుకోవడానికి ప్రతిరోజూ రాత్రి ఒక నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. అదేమిటంటే.. రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా ముగించడం. ఎవరైతే సాయంత్రం 7 గంటలకు లేదా అంతకంటే ముందే డిన్నర్ పూర్తి చేస్తారో, వారిలో బరువు చాలా వేగంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా త్వరగా తినడం వల్ల కలిగే లాభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..

రాత్రి త్వరగా తినడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణమవడానికి శరీరానికి తగినంత సమయం దొరుకుతుంది. రాత్రి వేళల్లో మెటబాలిజం రేటు నెమ్మదిస్తుంది. కానీ, త్వరగా తినడం వల్ల కొవ్వు రూపంలో క్యాలరీలు శరీరంలో పేరుకుపోకుండా శక్తిగా మారుతాయి. త్వరగా డిన్నర్ చేయడం వల్ల రాత్రి నిద్ర బాగా పడుతుంది. దీనివల్ల శరీరంలోని హార్మోన్లు బ్యాలెన్స్‌డ్‌గా ఉండి బరువు నియంత్రణలో ఉంటుంది.

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటీనటులు అనుష్క శర్మ, అక్షయ్ కుమార్, కాజోల్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఇలా సూర్యాస్తమయానికి ముందే తినే అలవాటును ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే వారు అంత ఫిట్‌గా ఉంటారని ఆయా వర్గాలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు ఏం చేయాలి?:

ఉద్యోగ రీత్యా చాలామందికి రాత్రి 7 గంటల లోపు తినడం సాధ్యం కాదు. అలాంటి వారు, రాత్రి భోజనంలో నూనె, నెయ్యి, స్వీట్లు, మసాలా పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి. రాత్రి పూట ఆహారం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. ఆలస్యంగా తిన్నప్పటికీ, భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు సాధారణ నడక సాగించాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా బరువు పెరగకుండా చూస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us