
వర్షాకాలంలో వాము ఆకుల మొక్క ఇంట్లో ఉంటే.. డాక్టర్ అవసరమే ఉండదంటారు.. అవును, ఎన్నో ఔషధ గుణాలున్న వామాకులు తీసుకుంటే.. పలు సమస్యలను నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాము (Ajwain Leaves) ఆకులు గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి కడుపు సమస్యలను తక్షణమే తగ్గిస్తాయి.. ఇందులో ఉండే థైమాల్ (Thymol) అనే రసాయనం వల్ల దీనికి మంచి సువాసన, ఔషధ గుణాలు చేకూరుతాయని పేర్కొంటున్నారు.. వాము ఆకు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు, ఆయుర్వేద చిట్కాలను ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందాం.. వాము ఆకును కొన్ని ప్రాంతాల్లో కప్పనీలాకు అని కూడా పిలుస్తారు. ఇది మన ఇంటి పెరట్లో సులభంగా పెంచుకోదగిన అద్భుతమైన మొక్క..
ఈ మొక్క ఆకు చాలా మందంగా, మెత్తగా, బలహీనంగా ఉంటుంది. దీనికి నీరు పెద్దగా అవసరం లేదు, ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ లేకుండానే ఇది చక్కగా బ్రతుకుతుంది. పైగా, దీనికి వేరు కూడా అవసరం లేకుండా, ఎక్కడి నుంచి తెచ్చి నాటుకున్నా ఈజీగా బ్రతికేస్తుంది. ఇది సుమారు మూడు అడుగుల వరకు పెరుగుతుంది. వాము ఆకు కేవలం వాము వాసన కలిగి ఉంటుంది, కానీ ఇది వాము (అజ్వైన్) గింజలను ఉత్పత్తి చేసే మొక్క కాదు. వాము గింజలు వేరే జాతి మొక్క నుండి వస్తాయి. వాము ఆకులతో రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. వాము రైస్, బజ్జీలు, చట్నీ, చారు వంటివి సాధారణంగా చేసుకోవచ్చు..
వాము ఆకు ముఖ్యంగా దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి. దీని ఆకు రసాన్ని వివిధ వ్యాధులకు మెడిసిన్ గా వాడుతూ ఉంటారు.
శ్రమ, కఫ, వాత సంబంధిత వ్యాధులు: ఈ ఆకు శ్రమ, కఫ, వాత సంబంధిత వ్యాధులను నయం చేసే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది.
దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి: 10 ml వాము ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జ్వరం, దగ్గు, జలుబు (కోల్డ్), తలనొప్పి, అలర్జీ వంటి వాటిని సులభంగా తగ్గించుకోవచ్చు. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు నాలుగైదు వాము ఆకులను ఉప్పుతో కలిపి తీసుకుంటే కొద్దిసేపటికే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
నీళ్ల విరేచనాలు: ఇది నీళ్ల విరేచనాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.
శరీర వేడి, నొప్పులు: వాము ఆకు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. చిన్నపాటి నొప్పులకు, అజీర్తికి, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు ఈ మొక్కను ఉపయోగించుకోవచ్చు.
నులిపురుగులు, కడుపు క్రిములు: కడుపులో ఉండే సూక్ష్మక్రిములను, నులిపురుగులను చంపే గుణం ఈ ఆకుకు అధికంగా ఉంది. ఆకు రసాన్ని వేడినీటిలో కలిపి తీసుకుంటే నులిపురుగులు చనిపోయి బయటకు వచ్చేస్తాయి.
మూత్రపిండాలు, హృదయ సంబంధిత జబ్బులు: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారికి, హృదయ సంబంధిత జబ్బులు ఉన్న వారికి ఇది ఒక అద్భుత సంజీవినిగా పేర్కొంటున్నారు..
ఆకలి, జీర్ణశక్తి: వాము ఆకుకు ఆకలిని పెంచే గుణం ఎక్కువగా ఉంది. దీనిని తీసుకోవడం వల్ల ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.
వాము ఆకులో పైన పేర్కొన్నవే కాకుండా ఇంకా అనేక ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంట్లో ఈ మొక్క ఉండటం ఒక సంజీవిని మెడిసిన్ ఇంట్లో ఉన్నట్లే. మన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్నపాటి రోగాలకు ఎటువంటి మెడిసిన్స్ లేకుండా కేవలం ఈ వాము ఆకును ఉపయోగించి తగ్గించుకోవచ్చు.
అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా వాము ఆకులను తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..