ఈ మధ్య కాలంలో యూరిక్ యాసిడ్‌తో బాధ పడే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయకపోతే ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు రావచ్చు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. గుండె జబ్బులు, అర్థరైటిస్, షుగర్ వ్యాధి కూడా రావచ్చు. శరీరంలో వ్యర్థాలు, మలినాలు పేరుకు పోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు వస్తాయి. అంతే కాకుండా చలి కాలంలో ఈ సమస్య మరింతగా పెరగొచ్చు. మరి చలి కాలంలో ఈ సమస్య పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి.
యూరిక్ యాసిడ్‌తో బాధ పడేవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. పన్నీర్, పాలు, పంచదార, పప్పులు, ఆహ్కహాలు, టమాటాలు, పాలకూర, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుంది. కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండండి. చలి కాలంలో ఈ ఆహారాలను తీసుకోకండి.
1. వేప, గోధుమ గడ్డి, తులసి, గిలోయ్, కలబంద మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల యూరిక్ యసాిడ్ కంట్రోల్ అవుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది.
2. పొట్టాకాయను రసంలా తీసుకుని అందులో తులిసి ఆకులు, ఐదు ఎండు మిర్చి కూడా కలిపి తాగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి.
3. యూరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీలపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి గోఖరును నీటిలో బాగా మరిగించాలి. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
4. ఉదయం వేప ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.
5. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత తమల పాకు నమిలినా కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి.
6. అదే విధంగా పసుపు, దాల్చిన చెక్క, వెల్లుల్లి తీసుకున్నా కూడా యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్ అవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.