సుర్రుమనే సమ్మర్ నుంచి ఇట్టే రిలీఫ్.. రోజుకో గ్లాస్ తాగితే బాడీ కూల్ కూల్

ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా.. సహజ సిద్ధమైన పుదీనా నీటిని తాగడం ఎంతో మంచిది.. దీనివల్ల శరీరం కూల్ అవ్వడంతోపాటు.. రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియా నుండి ఇది రక్షణ కల్పిస్తుంది. పుదీనా ఆకులలోని సాలిసిలిక్ యాసిడ్, విటమిన్‌లు చర్మానికి నిగారింపును అందిస్తాయి, ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడ్పడతాయి.

సుర్రుమనే సమ్మర్ నుంచి ఇట్టే రిలీఫ్.. రోజుకో గ్లాస్ తాగితే బాడీ కూల్ కూల్
Power Of Mint Water

Updated on: Apr 26, 2026 | 1:44 PM

పుదీనా ఆకులు అనేక పోషకాలకు నిలయం.. ఇవి శరీర ఆరోగ్యానికి, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. పుదీనాలో సుమారుగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియంతోపాటు.. ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించండంలో.. బరువు తగ్గడంలో సహాయపడతాయి. పుదీనా నీటిని క్రమం తప్పకుండా సేవించడం వల్ల శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా.. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచి, డీహైడ్రేషన్ తగ్గించడంలో పుదీనా నీరు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సులభంగా తయారుచేసుకోగలిగే పుదీనా పానీయం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. అలసటను పోగొట్టి తక్షణ శక్తిని ఇస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు..

పుదీనా ఆకులలో మెండుగా ఉండే పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వివిధ వ్యాధుల బారి నుండి కాపాడతాయి. అంతేకాకుండా, పుదీనా ఆకులలో సాలిసిలిక్ యాసిడ్ – విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు చర్మ ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనవి. ఇవి చర్మానికి సహజమైన నిగారింపును అందించి, కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.

పుదీనా వాటర్ ఒక రిఫ్రెషింగ్ డ్రింక్‌గా మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంపొందించే ఒక శక్తివంతమైన సాధనంగా కూడా పనిచేస్తుంది.

ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఇది అద్భుతమైన ఎంపిక. వేసవిలో వచ్చే అధిక వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

పుదీనాలో ఉండే ఈ అద్భుతమైన గుణాల వల్ల, దీనిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో ప్రయోజనాలు..

పుదీనా నీరు.. జీర్ణక్రియను మెరుగుపరచడం, గ్యాస్చ కడుపు ఉబ్బరాన్ని తగ్గించడం, నోటి దుర్వాసనను పోగొట్టడం, తలనొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మెంతోల్ శ్వాసకోశ సమస్యలను, జలుబును తగ్గిస్తుంది.

నోట్ : – ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. సందేహాలున్నా.. నేరుగా వై్య నిపుణులను సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us