
Spiritual Telangana Tour Package: తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతను ఒకేసారి అనుభవించాలని భావిస్తున్న పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్యాకేజీ “ఆధ్యాత్మిక తెలంగాణ” (SHH003). తెలంగాణ పర్యాటక శాఖ అందిస్తున్న ఈ 3 రోజుల పర్యటనలో హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, ప్రముఖ దేవాలయాలు, అలాగే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కల్పించబడుతుంది. ఈ ప్యాకేజీ రోడ్డు మార్గంలో నిర్వహించబడుతుంది. పర్యటనలో భాగంగా 2 రాత్రుల బస, 2 అల్పాహారాలు, 2 రాత్రి భోజనాలు అందిస్తారు. ప్రతి రోజు (శుక్రవారం మినహా) ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్‌ల నుంచి పర్యాటకులను తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అనంతరం నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల సందర్శన ప్రారంభమవుతుంది.
హోటల్‌లో అల్పాహారం అనంతరం నగరంలోని ప్రసిద్ధ ఆలయాలు, చారిత్రక ప్రాంతాలను సందర్శిస్తారు.
సాయంత్రం హోటల్‌కు తిరిగి చేరుకుని రాత్రి బస హైదరాబాద్‌లోనే ఉంటుంది.
అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్-అవుట్ చేసి యాదాద్రికి బయలుదేరుతారు. మార్గమధ్యంలో: సురేంద్రపురి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, యాదాద్రి దర్శనాల అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రైల్వే స్టేషన్‌లో దింపడంతో పర్యటన ముగుస్తుంది.
1 నుంచి ముగ్గురు ప్రయాణికులకు
ఇక, ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన బృందాల కోసం ప్రత్యేక టారిఫ్‌లకు టూరిజం కార్యాలయాన్ని సంప్రదించాలి.
హైదరాబాద్ చారిత్రక అందాలు, తెలంగాణ ఆధ్యాత్మిక వైభవం, యాదాద్రి దివ్య దర్శనం.. ఇవన్నీ ఒకే ప్యాకేజీలో ఆస్వాదించాలనుకుంటే ‘ఆధ్యాత్మిక తెలంగాణ’ టూర్ మీకు అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.
ఈ ఆధ్యాత్మిక టూర్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.