Weekend Tour: హైదరాబాద్ నుంచి మలేషియా-సింగపూర్‌కు IRCTC అదిరిపోయే 7 రోజుల టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే!

Magical Malaysia with Singapore Sensation: విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారికి IRCTC 'మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్' పేరుతో హైదరాబాద్ నుంచి 6 రాత్రులు–7 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. విమాన ప్రయాణం, హోటల్ బస, వీసా, భోజనాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనతో కూడిన ఈ ప్యాకేజీ 2026 ఆగస్టు 14న ప్రారంభం కానుంది.

Weekend Tour: హైదరాబాద్ నుంచి మలేషియా-సింగపూర్‌కు IRCTC అదిరిపోయే 7 రోజుల టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే!
Magical Malaysia With Singapore Sensation

Updated on: Jul 24, 2026 | 1:32 PM

IRCTC Malaysia Singapore Tour Package: విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ (IRCTC) మరో ఆకర్షణీయమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. “మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్” పేరుతో హైదరాబాద్ నుంచి 7 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా మలేషియాలోని కౌలాలంపూర్, జెంటింగ్ హైలాండ్స్, బటు గుహలు, పుత్రజయ వంటి ప్రముఖ ప్రాంతాలతో పాటు సింగపూర్‌లోని మెర్లియన్ పార్క్, సెంటోసా ఐలాండ్, యూనివర్సల్ స్టూడియోస్, గార్డెన్స్ బై ది బే, బర్డ్ ప్యారడైజ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ 2026 ఆగస్టు 14న హైదరాబాద్ నుంచి ప్రారంభమై ఆగస్టు 21న ముగుస్తుంది. మొత్తం 6 రాత్రులు – 7 రోజుల ఈ పర్యటనలో విమాన ప్రయాణం, హోటల్ బస, భోజనాలు, వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్, స్థానిక సందర్శనలు అన్నీ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

టూర్ వివరాలు

  • ప్యాకేజీ పేరు: Magical Malaysia with Singapore Sensation
  • ప్యాకేజీ కోడ్: SHO1
  • ప్రయాణ ప్రారంభం: 14 ఆగస్టు 2026
  • వ్యవధి: 6 రాత్రులు / 7 రోజులు
  • ప్రయాణ విధానం: విమాన ప్రయాణం
  • ప్రయాణ ప్రారంభ స్థలం: హైదరాబాద్

సందర్శించే ప్రాంతాలు: కౌలాలంపూర్, పుత్రజయ, బటు కేవ్స్, జెంటింగ్ హైలాండ్స్, సింగపూర్, సెంటోసా, యూనివర్సల్ స్టూడియోస్

విమాన వివరాలు

  • 14 ఆగస్టు 2026: హైదరాబాద్ నుంచి రాత్రి 11:15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:35 గంటలకు కౌలాలంపూర్ చేరుకుంటారు.
  • 21 ఆగస్టు 2026: సింగపూర్ నుంచి రాత్రి 8:00 గంటలకు బయలుదేరి, రాత్రి 10:00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

పర్యటనలో సందర్శించే ముఖ్య ప్రదేశాలు

  • తొలి రోజు: కౌలాలంపూర్ చేరుకున్న తర్వాత హోటల్‌లో విశ్రాంతి తీసుకుని, ప్రపంచ ప్రఖ్యాత పెట్రోనాస్ ట్విన్ టవర్స్ సందర్శన ఉంటుంది.
  • రెండో రోజు: కౌలాలంపూర్ నగర దర్శనం. ఇందులో: ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్, చాక్లెట్ షాప్, పుత్రజయ సందర్శన.
  • మూడో రోజు: బటు కేవ్స్, జెంటింగ్ హైలాండ్స్, రెండు వైపులా కేబుల్ కార్ ప్రయాణం
  • నాలుగో రోజు: రోడ్డు మార్గంలో సింగపూర్ ప్రయాణం చేసి హోటల్‌లో బస.
  • ఐదో రోజు: సింగపూర్ సిటీ టూర్‌లో: ఆర్కిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లయర్, కేబుల్ కార్ ద్వారా సెంటోసా, మేడమ్ టుస్సాడ్స్, ఇమేజెస్ ఆఫ్ సింగపూర్, వింగ్స్ ఆఫ్ టైమ్ షో.
  • ఆరవ రోజు: యూనివర్సల్ స్టూడియోస్, గార్డెన్స్ బై ది బే (రెండు డోమ్స్‌తో)
  • ఏడో రోజు: బర్డ్ ప్యారడైజ్ సందర్శన, షాపింగ్, అనంతరం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.

ప్యాకేజీ ధరలు:

  • సింగిల్ షేరింగ్: ₹1,91,000
  • డబుల్ షేరింగ్: ₹1,49,000
  • ట్రిపుల్ షేరింగ్: ₹1,48,500
  • పిల్లలు (బెడ్‌తో): ₹1,47,500
  • పిల్లలు (బెడ్ లేకుండా): ₹1,29,000

ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?

  • హైదరాబాద్–కౌలాలంపూర్, సింగపూర్–హైదరాబాద్ రిటర్న్ విమాన టికెట్లు
  • 3 స్టార్ హోటళ్లలో బస
  • 6 బ్రేక్‌ఫాస్ట్‌లు
  • 7 లంచ్‌లు
  • 6 డిన్నర్లు (చివరి రోజు ఇన్-ఫ్లైట్ డిన్నర్)
  • అన్ని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శన
  • స్థానిక టూర్ గైడ్ సేవలు
  • మలేషియా, సింగపూర్ వీసా
  • ట్రావెల్ ఇన్సూరెన్స్ (80 ఏళ్ల వరకు)
  • 2% టీసీఎస్

ప్యాకేజీలో లేనివి

  • వ్యక్తిగత ఖర్చులు
  • లాండ్రీ, అదనపు పానీయాలు
  • మెనూలో లేని ఆహార పదార్థాలు
  • డ్రైవర్లు, గైడ్‌లకు టిప్స్
  • ప్యాకేజీలో పేర్కొనని ఇతర సేవలు

బస చేసే హోటళ్లు

  • కౌలాలంపూర్: Ibis Styles Fraser లేదా సమాన స్థాయి హోటల్
  • సింగపూర్: Ibis Styles Macpherson లేదా సమాన స్థాయి హోటల్

బుకింగ్‌కు అవసరమైన పత్రాలు

  • కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్
  • పాన్ కార్డు
  • 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ (కనీసం రూ.75,000 బ్యాలెన్స్)
  • ఉద్యోగులు అయితే జీత స్లిప్‌లు, NOC
  • స్వయం ఉపాధి అయితే GST, కవరింగ్ లెటర్
  • విద్యార్థులు అయితే ఐడీ కార్డు
  • రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ ప్రూఫ్
  • వీసా కోసం అవసరమైన ఫోటోలు, ఇతర పత్రాలు

ముఖ్యమైన సూచనలు

  • పాస్‌పోర్ట్‌కు తిరుగు ప్రయాణం తేదీ నుంచి కనీసం 6 నెలల గడువు ఉండాలి.
  • బుకింగ్ నిర్ధారణ తర్వాత ప్యాకేజీ రద్దు చేస్తే రీఫండ్ ఉండదు.
  • 100 శాతం చెల్లింపు చేసిన తర్వాత మాత్రమే బుకింగ్ ఖరారవుతుంది.
  • హోటళ్లు అందుబాటును బట్టి మారే అవకాశం ఉంటుంది.
  • విమాన చార్జీలు లేదా పన్నులు పెరిగితే అదనపు భారం ప్రయాణికులదే.

విదేశీ పర్యటనను సౌకర్యవంతంగా, ప్రణాళికాబద్ధంగా చేయాలనుకునే వారికి ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మంచి ఎంపికగా చెప్పవచ్చు. విమాన ప్రయాణం నుంచి వీసా, హోటల్ బస, ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల సందర్శన వరకు దాదాపు అన్ని ఏర్పాట్లు ఒకే ప్యాకేజీలో ఉండటం ఈ టూర్ ప్రత్యేకత.

IRCTC ‘మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్’ టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us