Dengue in Kids: పిల్లల్లో డెంగ్యూ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

|

Jul 10, 2024 | 3:51 PM

వర్షా కాలం.. జబ్బుల కాలం అని అంటారు. వర్షా కాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులే కాకుండా.. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు కూడా వస్తాయి. ముఖ్యంగా పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ బయట ఆడటం, ఏవి పడితే అవి తింటూ ఉంటారు. అంతే కాకుండా పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. డెంగీ బారిన పడే వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా జ్వరం, తలనొప్పి, అలసట..

Dengue in Kids: పిల్లల్లో డెంగ్యూ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
Dengue In Kids
Follow us on

వర్షా కాలం.. జబ్బుల కాలం అని అంటారు. వర్షా కాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులే కాకుండా.. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు కూడా వస్తాయి. ముఖ్యంగా పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ బయట ఆడటం, ఏవి పడితే అవి తింటూ ఉంటారు. అంతే కాకుండా పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. డెంగీ బారిన పడే వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా జ్వరం, తలనొప్పి, అలసట, వాంతులు, శ్వాస కోశ సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తత అవసరం. జ్వరం లాంటివి వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం అవసరం. అలాగే ఇంట్లో కూడా కేర్ తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హైడ్రేట్‌గా ఉంచాలి:

డెంగీ బారిన పడిన పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడే అవకావాలు ఉన్నాయి. కాబట్టి వారిని ఎప్పటికప్పుడు హైడ్రేట్‌గా ఉంచాలి. నీటిని, నీటి శాతం ఉన్న వాటిని ఇస్తూ ఉండాలి. మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటివి ఇవ్వాలి. దీని వల్ల పిల్లలు హైడ్రేట్‌గా ఉంటారు.

రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాలు:

కొద్దిగా అనారోగ్యంగా ఉన్నా పిల్లలు ఆహారం తీసుకోవడానికి మారం చేస్తారు. అయినా సరే వారితో ఎంతోకొంత ఆహారం తినిపిస్తూ ఉండాలి. డెంగీ వచ్చినప్పుడు వారిలో ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటుంది. కాబట్టి సిట్రస్ పండ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, ఆకు కూరలతో చేసిన ఆహారం అందించాలి.

ఇవి కూడా చదవండి

మెంతి నీళ్లు:

డెంగీ ఫీవర్‌తో బాధ పడుతున్న పిల్లలకు మెంతి నీరు ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. డెంగీ ఫీవర్ ఉన్నప్పుడు పెద్ద వాళ్లు కూడా తాగవచ్చు. మెంతులను ఉడక బెట్టి.. ఆ నీటిని వడకట్టి చల్లార్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు రోజుకు రెండు సార్లు ఈ నీటిని పట్టించాలి. మెంతి నీరు జ్వరాన్ని తగ్గిస్తుంది. అలాగే బాడీలో ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్ట పరుస్తుంది.

నల్ల మిరియాలు:

డెంగీని తగ్గించడంలో నల్ల మిరియాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. నల్ల మిరియాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వైరస్‌లకు వ్యతిరేకంగా పని చేస్తాయి. కాబట్టి నల్ల మిరియాలతో చేసిన పాలు, ఆహారం పిల్లలకు ఇవ్వండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..