Lung Cancer : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? లంగ్‌ క్యాన్స‌ర్ కావొచ్చు…

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా క్యాన్స‌ర్ బారిన ప‌డుతోన్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కార‌ణంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా వేలాది మంది మ‌ర‌ణిస్తున్నారు...

Lung Cancer : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? లంగ్‌ క్యాన్స‌ర్ కావొచ్చు...
Lung Cancer
Follow us

|

Updated on: Aug 03, 2024 | 1:22 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా క్యాన్స‌ర్ బారిన ప‌డుతోన్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కార‌ణంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా వేలాది మంది మ‌ర‌ణిస్తున్నారు. స్మోకింగ్‌తో పాటు, ప‌ర్యావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పుల నేప‌థ్యంలో ఊపిరిత్తుల క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ఏ క్యాన్స‌ర్ అయినా మొద‌టి ద‌శ‌లో గుర్తిస్తే చికిత్స సుల‌భ‌తర‌మ‌వుతుంద‌ని నిపుణులు చెబుతుంటారు. మ‌రి లంగ్ క్యాన్స‌ర్‌ను తొలి ద‌శ‌లో ఎలా గుర్తించాలి.? ఈ క్యాన్స‌ర్ ప్రారంభ ల‌క్ష‌ణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌లో క‌నిపించే ప్ర‌ధాన ల‌క్ష‌ణం ద‌గ్గు. దీర్ఘ‌కాలంగా ఎడ‌తెర‌పి లేకుండా ద‌గ్గు ఉన్న‌ట్ల‌యితే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించి సంబంధిత ప‌రీక్ష‌లు చేయిచుంకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ద‌గ్గే స‌మ‌యంలో ర‌క్తం వ‌స్తున్న‌ట్లుతే అది లంగ్ క్యాన్స‌ర్‌కు ప్రాథ‌మిక ల‌క్ష‌ణంగా భావించాల‌ని చెబుతున్నారు. అలాగే క‌ఫం వ‌చ్చినా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉండ‌డం, ఛాతీలో నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఉన్నా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

ఇక ఏ కార‌ణం లేకుండా బ‌రువు త‌గ్గుతున్నా అది ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రోజంతా అలసటగా, బలహీనంగా అనిపిస్తే ఊపిరితిత్తుల్లో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దీని కారణంగా, కోలుకున్న తర్వాత కూడా బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి స‌మ‌స్య‌లు ప‌దే ప‌దే వ‌చ్చే అవకాశాలు ఉంటాయి. ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలో వింత శ‌బ్ధాలు రావ‌డం, గొంతు మార‌వ‌డం వంటి కూడా ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌కు ల‌క్ష‌ణంగా భావించాల‌ని అంటున్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ నాడీ వ్యవస్థలో కూడా మార్పుల‌కు దారి తీస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బలహీనత, తలనొప్పి, చేతులు, కాళ్ళలో తిమ్మిరిగా ఉండ‌డం మూర్ఛ రావ‌డం వంటి స‌మ‌స్య‌లు లంగ్ క్యాన్స‌ర్‌కు ల‌క్ష‌ణంగా భావించాలి. పైన తెలిపిన ల‌క్ష‌ణాలు ఏవి దీర్ఘ‌కాలంగా ఉన్నా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించి సంబంధిత ప‌రీక్ష‌లు చేయించుకుంటే క్యాన్స‌ర్‌ను జ‌యించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? లంగ్‌ క్యాన్స‌ర్ కావొచ్చు...
ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? లంగ్‌ క్యాన్స‌ర్ కావొచ్చు...
బోడకాకర.. సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్.. ఎన్నో వ్యాధులకు చెక్
బోడకాకర.. సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్.. ఎన్నో వ్యాధులకు చెక్
రెండో వన్డేలో కీలక మార్పు.. భారత జట్టు నుంచి ఆ ప్లేయర్ ఔట్
రెండో వన్డేలో కీలక మార్పు.. భారత జట్టు నుంచి ఆ ప్లేయర్ ఔట్
ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. ఆరోగ్యానికి వరం ఈ అమృత గింజలు..
ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. ఆరోగ్యానికి వరం ఈ అమృత గింజలు..
అందం ఈ కోమలి ప్రేమ కోసం దేవుణ్ణి వరం అడగదా.. ఐశ్వర్య పిక్స్..
అందం ఈ కోమలి ప్రేమ కోసం దేవుణ్ణి వరం అడగదా.. ఐశ్వర్య పిక్స్..
ఈశాన్యంలో ఈ త‌ప్పులు చేస్తున్నారా.? న‌ష్టం త‌ప్ప‌దు..
ఈశాన్యంలో ఈ త‌ప్పులు చేస్తున్నారా.? న‌ష్టం త‌ప్ప‌దు..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. మెట్రో పరుగులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. మెట్రో పరుగులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..
అంత్యక్రియల కోసం డబ్బు దాచి.. యువకుడు ఆత్మహత్య..
అంత్యక్రియల కోసం డబ్బు దాచి.. యువకుడు ఆత్మహత్య..
తాటిచెట్టుపై ఉరేసుకున్న వృద్ధుడు.. మృతదేహాన్ని దించుతుండగా
తాటిచెట్టుపై ఉరేసుకున్న వృద్ధుడు.. మృతదేహాన్ని దించుతుండగా
జ్ఞానోదయం అయింది.. 2029 ఎన్నికల్లో గెలుస్తా: బుద్ధా వెంకన్న
జ్ఞానోదయం అయింది.. 2029 ఎన్నికల్లో గెలుస్తా: బుద్ధా వెంకన్న