ఈసారి మార్కెట్‌కి వెళ్తే.. వీటిని కచ్చితంగా కొనండి
వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో బోడ కాకర ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే కడుపు ఇన్ఫెక్షన్స్‌కు ఇది దిద్యౌషదంగా పనిచేస్తుంది.
బోడ కాకరక ఫైబర్ కంటెంట్‌కు పెట్టింది పేరు. ఇందులో పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరగలానుకునే వారు బోడ కాకరను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
బీపీతో బాధపడేవారు బోడ కాకరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
వృద్ధాప్య లక్షణాలకు చెక్ పెటట్డంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులోని ఫ్లవనాయిడ్లు వయసుతో పాటు వచ్చే ముడతలను నియంత్రిస్తాయి.
కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడాడడంలో కూడా బోడకాకర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా అడ్డుకుంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.