రూ.50వేల కోట్లతో 8 హైస్పీడ్‌ రోడ్డు ప్రాజెక్టులు.. ఎక్కడంటే?

TV9 Telugu

03 August 2024

దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సామర్థ్యం, కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

రూ. 50,655 కోట్ల పెట్టుబడితో 936 కి.మీ పొడవు గల ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.

ఈ 8 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.42 కోట్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు నిపుణులు.

ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించిన ప్రాజెక్టులలో ఎనిమిది లేన్లతో నాసిక్ ఫాటా-ఖేడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ఒకటి.

ఆరు లేన్లలో ఆగ్రా-గ్వాలియర్‌, తరద్‌-దీసా-మోహసనా-అహ్మదాబాద్‌, కాన్పూర్‌ రింగ్‌ రోడ్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

నాలుగు లేన్లతో ఖరగ్‌పుర్‌-మోరేగావ్‌ నేషనల్‌ హైస్పీడ్‌ కారిడార్‌, అయోధ్య రింగ్‌ రోడ్ల నిర్మాణం జరగనున్నాయి.

రాయ్‌పుర్‌-రాంచీ మధ్య హైస్పీడ్‌ కారిడార్‌తోపాటు గువహటి బైపాస్‌ విస్తరణ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడి.

2047 నాటికి USD 30+ ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని మార్చడానికి ఇది తోడ్పడుతుందని మోదీ సర్కార్ అంచనా.