02 August 2024

40 ఏళ్లు దాటారా.?  ఈ మార్పులు త‌ప్ప‌నిస‌రి.. 

40 ఏళ్లు దాటిన వారు తీసుకునే ఆహారంలో క‌చ్చితంగా ఆకుకూర‌ల‌ను భాగం చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఐర‌న్, విట‌మిన్‌, కాల్షియం వంటివి పుష్క‌లంగా ఉండే వెజిటేబుల్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. 

పెస‌ర‌ప్పు, మిన‌ప‌ప్పు, శ‌న‌పప్పు వంట వాటిని కూడా తీసుకోవాలి. వీటివ‌ల్ల శ‌రీరానికి కావాల్సి పోష‌కాలు ల‌భిస్తాయి. ఫ‌లితంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

40 ఏళ్లు దాటిన వారు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో క‌చ్చితంగా ఉడికించిన గుడ్లు ఉండేలా చూసుకోవాల‌ని చెబుతున్నారు. ఇందులోని ప్రోటీన్‌, విట‌మిన్ డి, ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా చాక్లెట్స్‌, స్ట్రాబెర్రీల‌ను ఫుడ్‌లో భాగం చేసుకోవాలి. వీటివ‌ల్ల 40 ఏళ్ల త‌ర్వాత కూడా ఆరోగ్య ప‌దిలంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే ఫ్రీ రాడిక‌ల్స్‌ను అడ్డుకుంటాయి.

పెరుగు, మ‌జ్జిగ వంటి పాల సంబంధిత ప‌దార్థాల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా జీవ‌క్రియ సంబంధిత స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. 

40 ఏళ్లు నిండిన త‌ర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాల‌నుకుంటే తీసుకునే ఆహారంలో ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండే ఫుడ్‌ను భాగం చేసుకోవాల‌ని చెబుతున్నారు. దీంతో  జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. 

వ‌య‌సు మ‌ళ్లిన త‌ర్వాత కూడా ఫిట్‌గా ఉండాలంటే ఆహారంలో చేప‌ల‌ను భాగం చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది. 

పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.