Vastu Tips: ఈశాన్యంలో ఈ త‌ప్పులు చేస్తున్నారా.? న‌ష్టం త‌ప్ప‌దు..

ఇంట్లో ఈశాన్యం మూల‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంద‌ని వాస్తు నిపుణులు ప్ర‌త్యేకంగా చెబుతుంటారు. ఈశాన్యం అనేది దేవుడి స్థానంగా చెబుతుంటారు. ఇంట్లో అత్యంత ప‌విత్రంగా భావించే ఈశాన్యం మూల విష‌యంలో కొన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని చెబుతుంటారు. ఈశాన్య మూలకు అధిపతి...

Vastu Tips: ఈశాన్యంలో ఈ త‌ప్పులు చేస్తున్నారా.? న‌ష్టం త‌ప్ప‌దు..
Vastu
Follow us

|

Updated on: Aug 03, 2024 | 12:57 PM

ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఉండే ప్రాధాన్య‌త ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రీ ముఖ్యంగా భార‌తీయులు వాస్తును ఎక్కువ‌గా విశ్వ‌సిస్తుంటారు. అందుకే ఇంటి నిర్మాణం చేప‌ట్టాల‌నే ఆలోచ‌న రాగానే ముందు వాస్తు నిపుణుల‌ను సంప్ర‌దిస్తుంటారు. వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగానే ఇంటి నిర్మాణాన్ని చేప‌డుతుంటారు.

ఇంట్లో ఈశాన్యం మూల‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంద‌ని వాస్తు నిపుణులు ప్ర‌త్యేకంగా చెబుతుంటారు. ఈశాన్యం అనేది దేవుడి స్థానంగా చెబుతుంటారు. ఇంట్లో అత్యంత ప‌విత్రంగా భావించే ఈశాన్యం మూల విష‌యంలో కొన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని చెబుతుంటారు. ఈశాన్య మూలకు అధిపతి బృహస్పతి. అందుకే ఈశాన్యం మూల‌కు సంబంధించి కొన్ని ర‌కాల త‌ప్పులు చేయ‌కూడ‌ద‌ని సూచిస్తుంటారు. ఇంత‌కీ ఆ త‌ప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈశాన్యం మూల దేవ‌తా మూర్తుల‌కు నిల‌యంగా భావిస్తారు. అందుకే ఈశాన్యంలో దేవుడు గ‌ది ఏర్పాటు చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తారు. ఈ దిశ‌లో ఎల్ల‌ప్పుడూ సానుకూల శ‌క్తి ఉంటుంద‌ని భావిస్తారు. అందుకే ఈ దిశ‌లో కూర్చొని పూజ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయ‌ని చెబుతుంటారు. ఈ దిశ‌లో ల‌క్ష్మీ దేవీని పూజిస్తే ఆర్థికంగా మంచి జ‌రుగుతుంద‌ని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఎంతో ప‌విత్రంగా భావించే ఈశాన్యం దిశ‌లో కొన్ని ర‌కాల త‌ప్పులు చేయకూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

వీటిలో ప్ర‌ధాన‌మైంది ఈశాన్య దిశ‌లో పొర‌పాటున కూడా మ‌రుగుదొడ్డి లేకుండా చూసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇలా ఉంటే ఇంట్లో ఉండే వారికి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అలాగే ఈశాన్యంలో మెట్ల‌ను నిర్మించ‌కూడ‌దు. వీటివ‌ల్ల కుటుంబ స‌భ్యుల మ‌ధ్య క‌ల‌హాలు, మాన‌సిక అనారోగ్యాలు వెంటాడుతాయ‌ని అంటున్నారు. అలాగే ఈశాన్యంలో ఎలాంటి బ‌రువైన వ‌స్తువులు లేకుండా చూసుకోవాలి. ఇక ఈశాన్యం దిశ‌లో ఉండే గోడ‌కు న‌లుపు లేదా నీలం రంగును అస్స‌లు వేయ‌కూడ‌దు.

నోట్‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప‌లువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్ర‌మే. వీటిలో ఎలాంటి వాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..