జీర్ణాశయ సంబంధిత సమస్యలకు ఎండు ద్రాక్ష బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ప్రతీ రోజూ వీటిని తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి, జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుంది.
ఇక బ్లాక్ కిస్‌మిస్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఎంతగానో సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే బ్లాక్ కిస్మిస్‌లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కంటి శుక్లాలను తరిమికొడుతుంది.
రక్త ప్రసరణను మెరుగుపరచంలో కూడా కిస్మిస్‌లు ఎంతో ఉపయోగపడతాయి. బీపీతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
గుండె సబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ప్రతీ రోజూ నల్ల ద్రాక్షలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.