తాజాగా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి డైలీ టూర్ ప్యాకేజ్ ని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ.
ప్రతిరోజూ ఏసీ, నాన్ ఏసీ బస్సు సర్వీసుల్లో పర్యాటక భవన్ నుంచి ఉదయం 8:30 గంటలకు టూర్ ప్రారంభమవుతుంది.
9 గంటలకు CRO ఆఫీసుకు చేరుకొని శ్రీశైలానికి ప్రయాణం ప్రారంభమవుతుంది. అలా జర్నీలోనే మధ్యాహ్నం భోజనం ఉంటుంది.
ఈ టూర్ లో ముందుగా సాక్షి గణపతి ఆలయ దర్శనం చేసుకొని తర్వాత శ్రీశైలానికి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది.
ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. అయితే హోటల్ వారు బ్లాంకెట్స్, బెడ్ షీట్స్ ఇవ్వనందున మీరే సొంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
రెండో రోజు ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని టిఫిన్ తిని తర్వాత శ్రీశైలంలో రోప్ వే జర్నీ చేస్తారు.
పాతాళ గంగ, పాలధార, పంచధార, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్, శిఖరం చూసి అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 7 గం హైదరాబాద్ లో టూర్ ముగుస్తుంది.
ఏసీ బస్సు నాన్ ఏసీ రూమ్ పెద్దలకు రూ.2,990, పిల్లలకు రూ.2,392. నాన్ ఏసీ బస్సు, నాన్ ఏసీ రూమ్ కోసం పెద్దలకు రూ.2000, చిన్నారులకు రూ.1600.