ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు.. క్షణాల్లో ముడతలు మాయం

How To Remove Wrinkles Without Iron: ప్రస్తుత బిజీ లైఫ్ వల్ల చాలామందికి బట్టలు ఇస్త్రీ చేసుకునే సమయం ఉండట్లేదు. సరిగ్గా ఆఫీస్‌కు వెళ్లే టైమ్‌లో బట్టలపై ముడతలు కనిపిస్తే వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో ఐరన్ బాక్స్ లేకుండానే బట్టు ఉతికేప్పుడు ఒక చిన్ని ట్రిక్‌తో మీ బట్టలపై ఉన్న ముడతలను పొగొట్టొచ్చంటే మీరు నమ్ముతారు. నమ్మాల్సిందే అదెలానో చూద్దాం పదండి.

ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు.. క్షణాల్లో ముడతలు మాయం
Quick Wrinkle Removal

Updated on: Apr 25, 2026 | 2:08 PM

మీ బట్టలు ముడతలు పడ్డాయా? ఐరన్ బాక్స్ వేడెక్కే వరకు వెయిట్ చేసే టైం మీకు లేదా.. అయితే టెన్షనొద్దు ఓ సింపుల్‌ ట్రిక్‌తో క్షణాల్లో మీ బట్టలపై ఉన్న ముడతలను తొలగించొచ్చు. అవును మీ ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ ముక్కలతో ముడతలు తక్షణమే మాయం చేయవచ్చు. వినడానికి వింతగా ఉన్నా, ఇది సైంటిఫిక్ పద్ధతిలో పనిచేస్తుంది. వాషింగ్ మెషీన్ డ్రైయర్‌లో 2-3 ఐస్ ముక్కలు వేసి రన్ చేసినప్పుడు, లోపల ఉండే వేడికి ఆ ఐస్ కరిగి ఆవిరి లాగా మారుతుంది. ఈ ఆవిరి బట్టల పొరల్లోకి వెళ్లి, ముడతలను తొలగిస్తుంది. దీనివల్ల బట్టలు ఇస్త్రీ చేసినట్లుగా మృదువుగా మారుతాయి. ప్రస్తుతం ఈ చిట్కా సోషల్ మీడియాలో తెలగ వైరల్ అవుతోంది.

ఏ రకమైన బట్టలకు ఇది సెట్ అవుతుంది?

అయితే ఈ చిట్కా అన్ని రకాల ఫ్యాబ్రిక్‌లపై పనిచేస్తుందని మీరు అనుకుంటే, మీరు పొరబాటు పడట్టే ఎందుకంటే ఈ ట్రిక్ అన్ని రకాల బట్టలకు మాత్రమే పనిచేస్తుంది. ఇది కేవలం సింథటిక్, మిక్స్డ్ ఫ్యాబ్రిక్, నిట్ దుస్తులపై మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. కాటన్ బట్టలు లేదా డెనిమ్ జీన్ వంటి మందపాటి బట్టలకు ఇది పెద్దగా పని చేయదు. అలాగే బట్టలు మరీ ఎక్కువగా నలిగిపోయి ఉంటే కచ్చితంగా ఇస్త్రీ చేయాల్సిందే.

ఈ ట్రిక్ ఎలా ఉపయోగించాలి?

మీరు కూడా ఈ చిట్కాను ప్రయత్నించాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. డ్రైయర్‌లో మరీ ఎక్కువ బట్టలు వేసి వాషింగ్ మిషన్‌పై ఎక్కువ లోడ్ పడనీయకండి. తక్కువ బట్టలు ఉన్నప్పుడే ఆవిరి బాగా పడుతుంది. మీ వాషింగ్ మిషన్‌ డ్రయర్‌లో కేవలం 2 నుంచి 3 ఐస్ ముక్కలు మాత్రమే వేయండి. అలాగే మెషీన్‌ను మీడియం స్పీడ్‌లో ఉంచండి. బట్టలు కొంచెం తడిగా ఉంటే ఇంకా మంచి రిజల్ట్‌ ఉంటుంది.

ఈ ట్రిక్‌ వల్ల ఏంటి లాభం

ఈ ట్రిక్‌ వల్ల మనం బట్టలను మళ్లీ ఐరన్ చేసుకోవాల్సిన పని ఉండదు. దీని వల్ల సమయం, కరెంటు కూడా ఆదా అవుతుంది. అయితే ఇది కేవలం చిన్నపాటి ముడతలను మాత్రమే తొలగిస్తుంది. మీకు పక్కాగా, షార్ప్‌గా ఉండే ఇస్త్రీ కావాలంటే మాత్రం ఐరన్ బాక్స్ వాడాల్సిందే. మీకు అత్యవసర సమయంలో ఈ స్టీమ్ ఐరన్ ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us