
భారతీయ ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మూలికా మొక్కలలో సర్పగంధ ఒకటి. దీనిని చంద్రభాగ లేదా పాతాళగంధ అని కూడా పిలుస్తారు. సర్పగంధ లేదా చంద్రభాగ ఒక అత్యంత విలువైన ఆయుర్వేద మూలికా మొక్క. ఈ మొక్క వేళ్లు పాము ఆకారంలో వంకరగా ఉండటం, పాము కాటు నివారణకు ఔషధంగా వాడటం వల్ల దీనికి సర్పగంధ అనే పేరు వచ్చింది. సర్పగంధ వేళ్ల ఘాటైన వాసన, చేదు గుణం వల్ల పాములు, ఇతర విషకీటకాలు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా దూరంగా ఉంటాయని విశ్వసిస్తారు.
సర్పగంధ మొక్కను ఇంటి కుండీలలో లేదా తోటలలోనూ సులభంగా పెంచవచ్చు. దీనికి బాగా నీరు ఇంకిపోయే సారవంతమైన నేల, పాక్షికంగా ఎండ, క్రమం తప్పకుండా నీరు అవసరం. సర్పగంధ వేళ్ల ఘాటైన వాసన, చేదు గుణం వల్ల పాములు, ఇతర విషకీటకాలు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా దూరంగా ఉంటాయని విశ్వసిస్తారు. అయితే, ప్రాచీన కాలం నుండి పాము కాటుకు విష నివారిణిగా, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఆయుర్వేదంలో దీని వేళ్లను ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
ఈ మొక్క పెరగడానికి 60శాతం తోట మట్టి, 20శాతం ఇసుక, 20శాతం సేంద్రీయ ఎరువు కొబ్బరి పొట్టు లేదా వర్మీ కంపోస్ట్ కలిపిన మిశ్రమం శ్రేష్ఠమైనది. నీరు నిల్వ ఉండకుండా కుండీ అడుగున డ్రైనేజీ రంధ్రాలు ఉండాలి. సర్పగంధను విత్తనాల ద్వారా లేదా కాండం ముక్కల ద్వారా నాటవచ్చు. వర్షాకాలం లేదా వసంతకాలం దీని నాటేందుకు అనువైన సమయం. ఈ మొక్కకు తగినంత వెలుతురు లేదా పాక్షిక ఎండ అవసరం. ప్రతిరోజూ నేల తేమగా ఉండేలా కొద్దిగా నీరు పోయాలి, కానీ కుండీలో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.
సాంప్రదాయ నమ్మకాల ప్రకారం, సర్పగంధ మొక్క వేళ్లు, ఆకుల నుండి వచ్చే ఒక రకమైన ఘాటైన వాసన పాములకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పాములు తమ నాలుక ద్వారా వాసనను పసిగడతాయి కాబట్టి, సర్పగంధ వాసన ఉన్న ప్రాంతాలకు రావు అని నమ్ముతారు. అందుకే పూర్వం ఇళ్ల చుట్టూ దీనిని పెంచేవారు.
అయితే, శాస్త్రీయంగా ఈ మొక్క పాములను 100శాతం నిరోధిస్తుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఆయుర్వేదంలో పాము కాటు మరియు తేలు కాటుకు విష నివారిణిగా దీని వేళ్లను ఉపయోగిస్తారు.
దీని వేళ్లలో లభించే రిసర్పైన్ అనే ఆల్కలాయిడ్ అధిక రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆందోళన, ఒత్తిడి, మానసిక అలసట, నిద్రలేమి నివారణకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. సర్పగంధను కేవలం అలంకరణ మొక్కగానే కాకుండా, ఇంట ఆయుర్వేద సంపదగా పెంచుకోవచ్చు. అయితే దీని వేళ్లను ఔషధంగా వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
గమనిక: అయితే ఇది సహజంగా డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి ఉత్తమైనదే అయినప్పటికీ.. పూర్తిగా డయాబెటీస్‌ను తగ్గించలేదు. కాబట్టి వైద్యుల సలహా మేరకు ఇతర మందులను కూడా వాడడం ముఖ్యం.