Hair Care: అన్నంతో కూడా జుట్టును పొడుగ్గా పెంచుకోవచ్చు.. ఎలాగంటే..

|

Oct 23, 2024 | 1:30 PM

జుట్టు ఒత్తుగా, బలంగా, పొడుగ్గా ఉండాలని ఆడవారు కోరకుంటారు. జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెంచుకునేందుకు ఏవోవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా మార్కెట్లో లభ్యమయే ప్రోడెక్ట్స్.. నూనెలు, షాంపూలు ఉపయోగిస్తారు. అయితే ఇవి అందరికీ పడవు. చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంట్లోని మీ కిచెన్‌లో ఉన్న వాటితోనే మీ జుట్టును అందంగా మార్చుకోవచ్చు. అయితే ఇందుకు కాస్త శ్రమ పడాలి. జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెంచే ఎన్నో రకాల చిట్కాలను మనం ఇప్పటికే..

Hair Care: అన్నంతో కూడా జుట్టును పొడుగ్గా పెంచుకోవచ్చు.. ఎలాగంటే..
Hair Care Tips
Follow us on

జుట్టు ఒత్తుగా, బలంగా, పొడుగ్గా ఉండాలని ఆడవారు కోరకుంటారు. జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెంచుకునేందుకు ఏవోవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా మార్కెట్లో లభ్యమయే ప్రోడెక్ట్స్.. నూనెలు, షాంపూలు ఉపయోగిస్తారు. అయితే ఇవి అందరికీ పడవు. చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంట్లోని మీ కిచెన్‌లో ఉన్న వాటితోనే మీ జుట్టును అందంగా మార్చుకోవచ్చు. అయితే ఇందుకు కాస్త శ్రమ పడాలి. జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెంచే ఎన్నో రకాల చిట్కాలను మనం ఇప్పటికే ఎన్నో తెలుసుకున్నాం. తాజాగా అన్నంతో కూడా మన జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? నిజంగానే ఈ విషయం షాక్‌కి గురవుతారు. నిజమే అన్నం.. జుట్టుకు చక్కటి పోషణను అందిస్తుంది. మరి జుట్టుకు అన్నాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నంతో హెయిర్ ప్యాక్‌కి కావాల్సిన పదార్థాలు..

ఉడికించిన అన్నం, బియ్యం కడిగిన నీరు, మెంతులు, బీట్ రూట్ జ్యూస్, కలబంద.

హెయిర్ ప్యాక్..

ముందుగా ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ముందు.. మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత ఉండికించిన అన్నాన్ని కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యం కడిగిన నీరు, బీట్ రూట్ జ్యూస్, కలబంద గుజ్జు ఇది కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. ఓ అరగంట పాటు అలానే ఉంచి.. ఆ తర్వాత షాంపూతో స్నానం చేయాలి. షాంపూ తర్వాత కండీషనర్ పెట్టండి. ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జుట్టు రాలడం తగ్గి.. చక్కగా పెరుగుతుంది. పొడుగ్గానే కాకుండా ఒత్తుగా కూడా ఉంటుంది. జుట్టు బాగా రాలుతుంది అన్నవారు ఈ ప్యాక్‌కి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే కాకుండా జుట్టు మెత్తగా ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి అయినా ట్రై చేయండి. ఈ చిట్కా మంచి ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..