Peanuts vs Cashew: పల్లీలు vs జీడిపప్పు.. వీటిల్లో ఏది ఎక్కువగా తీసుకుంటే బెటర్?

|

Oct 18, 2024 | 4:27 PM

జీడిపప్పు, పల్లీలు ఈ రెండూ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఈ రెండింటి రేట్లలో కూడా చాలా తేడా ఉంది. ప్రస్తుతం జీడిపప్పు రూ.700 పైనే పలుకుతుంది. కిలో వేరు శనగ కూడా దగ్గరగా రూ.200లు ఉండొచ్చు. అయితే సామాన్యులు ఎక్కువగా తీసుకునేది మాత్రం వేరుశనగ మాత్రమే. వేరు శనగను పేదోడి జీడిపప్పు అని కూడా పిలుస్తారు. జీడిపప్పులో ఉండే పోషకాలు అన్నీ కాస్త దగ్గరగా వేరు శనగలో కూడా ఉంటాయి. పల్లీలతో తయారు..

Peanuts vs Cashew: పల్లీలు vs జీడిపప్పు.. వీటిల్లో ఏది ఎక్కువగా తీసుకుంటే బెటర్?
Peanuts Vs Cashews New
Follow us on

జీడిపప్పు, పల్లీలు ఈ రెండూ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఈ రెండింటి రేట్లలో కూడా చాలా తేడా ఉంది. ప్రస్తుతం జీడిపప్పు రూ.700 పైనే పలుకుతుంది. కిలో వేరు శనగ కూడా దగ్గరగా రూ.200లు ఉండొచ్చు. అయితే సామాన్యులు ఎక్కువగా తీసుకునేది మాత్రం వేరుశనగ మాత్రమే. వేరు శనగను పేదోడి జీడిపప్పు అని కూడా పిలుస్తారు. జీడిపప్పులో ఉండే పోషకాలు అన్నీ కాస్త దగ్గరగా వేరు శనగలో కూడా ఉంటాయి. పల్లీలతో తయారు చేసిన ఆయిల్‌ని కూడా వంటలకు ఉపయోగిస్తూ ఉంటారు. రేట్లలో కూడా వ్యత్యాసం ఉండటంలో చాలా మంది జీడిపప్పు మంచిది? వేరు శనగలో ఏముంది అనుకుంటారు. కానీ ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి? ఏది తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

జీడిపప్పు:

జీడిపప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే మితంగానే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. జీడిపప్పులో.. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఇ, బి, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, క్యాలరీలు, పిండి పదార్థాలు ఉంటాయి. ప్రతి రోజూ ఓ 5 పలుకులు జీడిపప్పు తింటే శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది. బరువు అదుపులోకి వస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ క్రియకు మేలు చేస్తుంది. ఇందులో మంచి కొవ్వులు ఉంటాయి. చర్మం కూడా అందంగా మారుతుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆస్పత్రికి వెళ్లక తప్పదు.

వేరుశనగ:

వేరు శనగని ప్రతి రోజూ మనం ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. పులిహోర, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్ చట్నీల్లో పల్లీలను ఉపయోగిస్తూ ఉంటాం. వేరు శనగలో.. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, లిపిడ్లు, పొటాషియం, విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, క్యాలరీలు, పిండి పదార్థాలు ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం గుప్పెడు ఉడక బెట్టిన వేరు శనగ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. జుట్టు, చర్మ ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా, గుండె ఆరోగ్యంగా పని చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఏది బెటర్..

ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే జీడిపప్పుతో పోల్చితే వేరుశనగలో విటమిన్లు, ప్రోటీన్ శాతం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఎవరి ఆరోగ్య అవసరాలను బట్టి వారు వాటిని తీసుకోవచ్చు. ఎక్కువగా వేరు శనగ తిన్నా మంచిది కాదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..