Kitchen Hack: స్టైలిష్‌గా కనపడే మీ వంట ప్యాన్ చివర్లో ఈ రంధ్రం ఎందుకుంటుందో తెలుసా?

మనం వంట చేసేటప్పుడు వాడే ప్యాన్లు, గిన్నెల హ్యాండిల్స్ చివర ఒక చిన్న రంధ్రం ఉంటుంది. చాలామంది దీనిని కేవలం పాత్రలను గోడకు వేలాడదీయడానికి మాత్రమే అనుకుంటారు. కానీ, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలు ఒక వైరల్ కిచెన్ హ్యాక్ దాగి ఉన్నాయి. మీరు రోజూ చూసే ఆ చిన్న రంధ్రం అసలు ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Kitchen Hack: స్టైలిష్‌గా కనపడే మీ వంట ప్యాన్ చివర్లో ఈ రంధ్రం ఎందుకుంటుందో తెలుసా?
Why Pan Handles Have Holes

Updated on: Mar 28, 2026 | 4:07 PM

వంట చేసేటప్పుడు వాడే గరిటెను ఎక్కడ పడితే అక్కడ పెడితే ప్లాట్‌ఫాం అంతా నూనె జిడ్డు అవుతుంది. ఈ సమస్యకు ఆ హ్యాండిల్ రంధ్రంతోనే పరిష్కారం దొరుకుతుంది. అలాగే, లోహపు పాత్రలు వేడెక్కినప్పుడు మీ చేతులు కాలకుండా ఇది సేఫ్టీగా ఉంటుంది. అంతేకాదు ఇరుగ్గా ఉండే వంటగదుల్లో ఈ రంధ్రం ఉండే ప్యాన్ లో ఎంతో తేలిగ్గా ఇమిడిపోగలవు. మరి దీని అసలు బెనిఫిట్స్ ఏంటో మీరూ చూసేయండి.

1. స్పూన్ హోల్డర్‌గా :

వంట చేసేటప్పుడు మనం వాడే గరిటె లేదా చెంచాను ప్లాట్‌ఫాం మీద పెడితే ఆ ప్రదేశం మురికి అవుతుంది. మీ చెంచా కాడ గనుక ఆ రంధ్రం పరిమాణానికి సరిపోతే, దానిని ఆ రంధ్రంలో నిలువుగా పెట్టవచ్చు. దీనివల్ల గరిటెకు అంటుకున్న ఆహారం లేదా నూనె నేరుగా తిరిగి పాత్రలోకి కారిపోతుంది. ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

2. వేడిని తగ్గించడానికి :

లోహపు పాత్రలు వేడిని త్వరగా గ్రహిస్తాయి. హ్యాండిల్ చివర రంధ్రం ఉండటం వల్ల ఆ ప్రాంతంలో లోహం తక్కువగా ఉంటుంది. ఇది హ్యాండిల్ అంతా వేడి వ్యాపించకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా, ఆ రంధ్రం గుండా గాలి వెళ్లడం వల్ల హ్యాండిల్ త్వరగా చల్లబడుతుంది.

3. స్థలాన్ని ఆదా చేయడానికి :

పూర్వ కాలం నుండి ఉన్న ప్రధాన ఉపయోగం ఇదే. వంటగదిలో అరలు లేనప్పుడు పాత్రలను మేకులకు లేదా కొక్కేలకు వేలాడదీయడానికి ఈ రంధ్రం ఉపయోగపడుతుంది. దీనివల్ల పాత్రలు సులభంగా అందుబాటులో ఉంటాయి మరియు కిచెన్ చూడటానికి పద్ధతిగా ఉంటుంది.

ఇకపై వంట చేసేటప్పుడు ఆ రంధ్రాన్ని కేవలం వేలాడదీయడానికే కాకుండా, మీ గరిటెను ఉంచడానికి కూడా వాడి చూడండి. మీ కిచెన్ ప్లాట్‌ఫాం శుభ్రంగా ఉంటుంది!

వేడి గరిటెను హ్యాండిల్ రంధ్రంలో పెట్టేటప్పుడు అది ప్లాస్టిక్ హ్యాండిల్ అయితే కరిగిపోకుండా జాగ్రత్త వహించండి.

Follow Us