మతిపోగొట్టే మిరాకిల్ ఇది.! రోజుకో గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు కరిగిపోయి కిలోలు తగ్గుతారు

ఈ మధ్యకాలంలో చాలామందికి బరువు తగ్గడం ఓ పెద్ద సవాల్‌గా మారింది. మరి దానికోసం ఓ ఇంటి చిట్కాను మీ ముందుకు తెచ్చేశాం. నిమ్మ, తేనె, వేయించిన జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తయారుచేసే ఈ వాటర్ జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

మతిపోగొట్టే మిరాకిల్ ఇది.! రోజుకో గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు కరిగిపోయి కిలోలు తగ్గుతారు
Weight Loss

Updated on: Mar 22, 2026 | 3:58 PM

ఆధునిక జీవనశైలి కారణంగా అధిక బరువు సమస్య చాలామందిని వేధిస్తోంది. దాదాపు 90 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఈ సమస్యను వంటింటి చిట్కాలతో ఈజీగా పరిష్కరించవచ్చు. నిమ్మ, తేనె, వేయించిన జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తయారుచేసే ఈ వాటర్ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఈ వాటర్ తయారీకి మూడు ముఖ్యమైన పదార్థాలు అవసరం: నిమ్మకాయలు, స్వచ్ఛమైన తేనె, వేయించి పొడి చేసిన జీలకర్ర. వీటితో పాటు 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కావాలి.

నిమ్మకాయ:

నిమ్మరసం బరువు తగ్గడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే డయాస్పిన్, హెస్పెరిడిన్, సిట్రిక్ యాసిడ్ లాంటి అనేక రకాల పదార్థాలు జీవక్రియను(మెటబాలిజం) వేగవంతం చేసి శరీరంలోని కొవ్వును కరిగించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడతాయి. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, పైగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

తేనె:

స్వచ్ఛమైన తేనె బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా, ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే, చక్కెర వ్యాధిగ్రస్తులు తేనెను అధికంగా వాడటం మంచిది కాదు కాబట్టి, వారు వైద్యుల సలహా తీసుకోవడం లేదా దీనిని మినహాయించడం మంచిది.

జీలకర్ర చూర్ణం:

జీలకర్ర మన వంటింట్లో సంవత్సరం పొడవునా లభించే ఒక దివ్యమైన ఆహార ఔషధం. దీన్ని కొద్దిగా వేయించి పొడి చేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర కూడా బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

తయారీ విధానం:

ఒక గ్లాసులో 150 మి.లీ గోరువెచ్చని నీళ్లు తీసుకోండి.

దీంట్లో ఒక టీస్పూన్ (సుమారు 5 మి.లీ) నిమ్మరసం కలపండి.

అదేవిధంగా, ఒక టీస్పూన్ (సుమారు 5 మి.లీ) స్వచ్ఛమైన తేనెను జోడించండి.

చివరగా, పావు టీస్పూన్ నుంచి అర టీస్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తాగేయండి.

ఇది చదవండి: చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.! ఎవ్వరికీ తెలియని నిజం

Follow Us