ఆ దేశంలో అసలు దోమలే ఉండవట..!

ఈ భూమి మీద అతి ప్రమాదకరమైన జీవి.. ఏదంటే.. రకరకాల క్రూర జంతువుల గురించి చెబుతాం.. కానీ.. మన ఇంట్లోనే పొంచి ఉన్న ప్రమాదం గురించి మర్చిపోతాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అన్ని రకాల జంతువుల కంటే అతి ప్రమాదకరమైన జీవి దోమ. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడతాం. ముఖ్యంగా.. మాన్‌సూన్ సీజన్లో వీటి విజృంభన మామూలుగా ఉండదు. ఈ దోమల నివారణా చర్యలు చేపట్టినా.. ఈ దోమలను మాత్రం అరికట్టలేకపోతున్నాం. […]

ఆ దేశంలో అసలు దోమలే ఉండవట..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 22, 2019 | 9:21 PM

ఈ భూమి మీద అతి ప్రమాదకరమైన జీవి.. ఏదంటే.. రకరకాల క్రూర జంతువుల గురించి చెబుతాం.. కానీ.. మన ఇంట్లోనే పొంచి ఉన్న ప్రమాదం గురించి మర్చిపోతాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అన్ని రకాల జంతువుల కంటే అతి ప్రమాదకరమైన జీవి దోమ. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడతాం. ముఖ్యంగా.. మాన్‌సూన్ సీజన్లో వీటి విజృంభన మామూలుగా ఉండదు. ఈ దోమల నివారణా చర్యలు చేపట్టినా.. ఈ దోమలను మాత్రం అరికట్టలేకపోతున్నాం.

కానీ.. మీకో విషయం తెలుసా..? చైనాలోని ఓ రెండు దీపాల్లో అసలు దోమలే కనబడవట. 2018లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు.. జన్యు సవరణ చేసిన మగదోమలను సిద్ధం చేశారు. ఈ మగ దోమల్లో ‘వాల్బాచియా’ అనే బ్యాక్టీరియాను జొప్పించారు. దీంతో.. మగదోమలు.. ఆడ దోమలకు సంపర్కం చెందినప్పుడు.. ఇక ఆడ దోమల్లోని గుడ్లు ఫలదీకరణం చెందవట. సో.. దోమలు పెరగవు.. దానికి తోడు రేడియేషన్‌ని కూడా శాస్త్రవేత్తలు సిద్ధం చేశారట. ఇంకేముంది.. ఈ ప్రయోగం సక్సెస్ అయి.. ఆ ఏరియాల్లో అసలు దోమలే ఉండవని చెబుతున్నారు. ఈ దోమల వల్ల అంటు వ్యాధులు ప్రబలి.. మలేరియా, డెంగ్యూ వంటి జబ్బులు తగ్గుముఖం పడతాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu