మూడు రోజుల్లోనే మిరాకిల్.. గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. ఉదయాన్నే ఇలా చేస్తే..

వాము అనేది మన వంటగదులలో సులభంగా దొరికే ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం.. వాము నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా, దీనిని మూడు రోజులు క్రమం తప్పకుండా పరగడుపున తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, జలుబు, తలనొప్పి వంటివి నివారించడంలో వాము అద్భుతంగా పనిచేస్తుంది.

మూడు రోజుల్లోనే మిరాకిల్.. గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. ఉదయాన్నే ఇలా చేస్తే..
Vamu Water

Updated on: Apr 02, 2026 | 10:07 AM

వాము, ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉండే ఒక సుగంధ ద్రవ్యం. ఇది కేవలం వంటకాలకు రుచిని, సువాసనను అందించడమే కాకుండా, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం, వేల సంవత్సరాల క్రితమే అష్టాంగ హృదయంలో ఆయుర్వేద మహర్షి వాగ్భటాచార్య వామును “వాత పిత్త నాశకారిణి” గా పేర్కొన్నారు. దీని అర్థం వాము శరీరంలోని గ్యాస్ (వాతం), ఎసిడిటీ (పిత్తం) సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వాములో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, థైమోల్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా కడుపు సమస్యలను నివారించడంతోపాటు.. ఎన్నో సమస్యలకు అద్భుతంగా నివారణగా పనిచేస్తాయి

వాము ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణక్రియ మెరుగుదల: వాము నీటిని రోజూ పరగడుపున తాగడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది. ఇది మెటబాలిజంను పెంచి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడం: వాము నీరు బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. రాత్రిపూట ఒక చెంచా వామును ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని గోరువెచ్చగా చేసి తాగాలి. నానిన వామును నమిలి మింగడం వల్ల శరీరంలో అనవసర కొవ్వు కరిగి, స్థూలకాయం నుండి నాజుకైన శరీర సౌందర్యాన్ని పొందవచ్చు. క్రమం తప్పకుండా తీసుకుంటే నెలలో 5 నుండి 10 కిలోలు తగ్గవచ్చని, దీర్ఘకాలంలో అధిక బరువును నియంత్రించవచ్చని చెబుతారు.

నొప్పుల నివారణ: కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, శరీరంలోని ఇతర నొప్పుల నివారణకు వాము చాలా బాగా పనిచేస్తుంది. వాము నూనెను కీళ్లపై మర్దన చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బహిష్టు నొప్పుల సమయంలో వేయించిన వామును పాలతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

జలుబు – తలనొప్పి: వాము పొడిని ఒక గుడ్డలో కట్టి వాసన చూడటం వల్ల జలుబు, మైగ్రేన్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. వాము, ధనియాలు, జీలకర్ర కషాయం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

దంత ఆరోగ్యానికి: వామును త్రిఫలాలు (కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ)తో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాల్లో పెట్టుకుంటే అన్ని రకాల దంత వ్యాధులు తగ్గుతాయి. వామును బుగ్గన పెట్టుకుని నమిలితే గొంతు నొప్పి, గరగర తగ్గుతాయి.

కిడ్నీ రాళ్లు: వామును వివిధ రూపాల్లో సేవిస్తే మూత్రపిండాల్లో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది.

ఆస్తమా: ఆస్తమాతో బాధపడేవారు వామును బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

గుండె ఆరోగ్యం: గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము కీలక పాత్ర పోషిస్తుంది.

గర్భధారణ సమయంలో: గర్భవతులు వామును క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తాన్ని శుభ్రపరచి, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

చర్మ – కేశ సంరక్షణ: వాము పొడిని నీటితో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. వాము, కరివేపాకు, ఎండుద్రాక్ష, చక్కెరను ఒక కప్పు నీటిలో ఉడికించి తాగడం వల్ల జుట్టు తెల్లబడటాన్ని నివారించవచ్చని చెబుతారు.

దోమల నివారణ: ఆముద నూనె, వాము కలిపి కార్డ్‌బోర్డులకు, కిటికీలకు, తలుపులకు రాస్తే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

వామును నీటిలో, పాలతో, కూరలలో, మజ్జిగలో లేదా నేరుగా ఉప్పుతో కలిపి తీసుకోవచ్చు. అయితే, రాత్రిపూట నానబెట్టిన వాము నీటిని పరగడుపున తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వదే నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us