ఓవైపు పేదరికం, అప్పుల కుప్పలు.. ఇంకోవైపు ఫ్యాషన్‌ షో.. పాక్ కలరింగ్ మామూలుగా లేదుగా..!

ఓవైపు యుద్ధాలు.. ఇంకోవైపు కరువు కాటకాలు.. అన్నింటికీ మించి పేదరికం, అప్పుల కుప్పలు. ఇవన్నీ ఆ దేశంలో తాండవిస్తుంటే.. ఇంకోవైపు ఫ్యాషన్‌ షోలతో మా దేశం దూసుకుపోతోందని నమ్మించాలని చూస్తోంది దాయాది దేశం. లాహోర్‌లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన LAAM ఫ్యాషన్‌ వీక్‌ జరిగింది.

ఓవైపు పేదరికం, అప్పుల కుప్పలు.. ఇంకోవైపు ఫ్యాషన్‌ షో.. పాక్ కలరింగ్ మామూలుగా లేదుగా..!
Laam Fashion Week 2026

Updated on: Feb 04, 2026 | 8:19 PM

ఓవైపు యుద్ధాలు.. ఇంకోవైపు కరువు కాటకాలు.. అన్నింటికీ మించి పేదరికం, అప్పుల కుప్పలు. ఇవన్నీ ఆ దేశంలో తాండవిస్తుంటే.. ఇంకోవైపు ఫ్యాషన్‌ షోలతో మా దేశం దూసుకుపోతోందని నమ్మించాలని చూస్తోంది దాయాది దేశం. లాహోర్‌లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన LAAM ఫ్యాషన్‌ వీక్‌ జరిగింది. ఈ ఫ్యాషన్ వీక్‌లో పాకిస్తాన్‌కు చెందిన మోడల్స్‌ లేటెస్ట్‌ ట్రెండీ దుస్తులతో కనిపించారు.

ఈ ఫ్యాషన్‌ వీక్‌ పాకిస్తాన్‌కు చాలా కీలకం. ఎందుకంటే పాక్‌లో ఉన్న ప్రముఖ డిజైనర్లు, టాప్‌ మోడల్స్‌తో తమ టాప్‌ కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. ఈసారి కూడా ప్రముఖ మోడల్స్‌ను దించారు. తమ లేటెస్ట్‌ ట్రెండ్స్‌ను చూపించారు. చిట్టిపొట్టి దుస్తుల నుంచి.. బ్రైడల్‌ కలెక్షన్స్‌ వరకు మోడల్స్‌ ర్యాంప్‌పై వయ్యారంగా నడుస్తూ ప్రదర్శించారు.

ఈ ఫ్యాషన్‌ వీక్‌ను 120 దేశాల్లో లైవ్‌ టెలికాస్ట్‌ చేసింది పాకిస్తాన్‌. ఎందుకంటే తమ దేశం గురించి గొప్పలు చెప్పకోడానికి ఏదో ఓటి చూపించుకోవాలిగా..! అదే లక్ష్యంతో ఫ్యాషన్‌ వీక్‌ను నిర్వహించింది. ఓవైపు బలూచిస్తాన్‌ తమ ఆర్మీపై విరుచుకుపడుతున్న సంగతిని పట్టించుకోవడంలేదు. ఆఫ్ఘనిస్తాన్‌ నిర్వహిస్తున్న మిషన్స్‌పైనా పెద్దగా పట్టింపులేదు. పైగా భారత్‌తో ఏళ్ల తరబడి కయ్యం పెట్టుకోవడం.. ఇప్పుడు క్రికెట్‌ దగ్గర తమ రాజకీయం చేస్తూ భారత్‌తో మ్యాచ్‌ను కూడా బాయ్‌కాట్‌ చేసింది పాకిస్తాన్‌. ఇన్ని తప్పులు, లోపాలు, దారుణాలు కప్పిబుచ్చుకునేందుకు ఇలాంటి ఫ్యాషన్‌ షోలను నిర్వహిస్తూ పైకి గంభీరాలకు పోతోంది.

ఈ ఫ్యాషన్‌ షో… భారీ భద్రత నడుమ జరిగింది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ముష్కరుడు వచ్చి దాడులు చేస్తాడో అన్న భయం ప్రభుత్వంలో ఉంది. అసలే మహిళలపై కఠినంగా వ్యవహరించే గ్రూపులు చాలా ఉన్నాయి. అలాంటి వారి నుంచి రక్షించుకునేందుకు ఈ ఫ్యాషన్‌ వీక్‌ను భారీ భద్రత నడుమ నిర్వహించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..