తమ జుట్టు పొడుగ్గా, బలంగా ఉండాలని చాలా మంది ఆడవారు కోరుకుంటారు. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మార్కెట్లో వచ్చే కొత్త కొత్త ప్రాడెక్ట్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మారిన ఆహారపు విధానాలు, జీవన శైలి కారణంగా జుట్టు కూడా ప్రస్తుత కాలంలో విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. మొదట్లోనే ఈ సమస్యను తగ్గించుకోక పోతే మరింత పెరిగి జుట్టు పల్చగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేయడంలో మందార పువ్వు ఎంతో అత్భుతంగా పని చేస్తుంది. మందార పువ్వులో అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పువ్వులతో జుట్టును బలంగా, దృఢంగా చేసుకోవచ్చు. అంతే కాకుండా జుట్టు కూడా పొడవుగా, నల్లగా మారుతుంది. మరి హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేయడానికి, జుట్టును పొడవుగా మార్చడానికి మందార పువ్వు ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
ముందుగా 10 నుంచి 15 మందరా పువ్వులను తీసుకోవాలి. వీటిని బాగా శుభ్రం చేసి.. మిక్సీలో వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును జుట్టుకు మొత్తం పట్టించి.. సున్నితంగా మాడుపై మర్దనా చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ను కనీసం అరగంట పాటు అయినా ఉంచేయండి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తల స్నానం చేయండి. ఇలా వారంలో రెండు సార్లు ట్రై చేస్తే.. జుట్టు ఊడదు.
మందార పువ్వులను పేస్టుల పెట్టేందుకు ఇష్టం లేని వాళ్లు.. కొబ్బరి నూనెలో కూడా కలిపి ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో రెండు కప్పుల కొబ్బరి నూనె వేసి.. అందులో మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి.. వేసి మరిగించాలి. కొబ్బరి నూనె రంగు మారేంత వరకు.. నూనెను మరిగించాలి. నేరుగా కాకుండా డబుల్ బాయిలింగ్ పద్దతిలో చేస్తే చాలా మంచిది. కొబ్బరి నూనె రంగు మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి.. గిన్నెను పక్కకు ఉంచండి. ఈ నూనెను తలకు బాగా పట్టించి.. సున్నితంగా మర్దనా చేయాలి. ఒక పూట తలకు కొబ్బరి నూనె ఉంచి ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..