Korean Skin: ఇలా చేశారంటే కొరియన్ గ్లాస్ లాంటి చర్మం మీ సొంతం..

|

Oct 22, 2024 | 4:56 PM

చర్మం పట్ల ఎంతో ఆసక్తిని చూపిస్తారు మహిళలు. అందమైన చర్మం కోసం తహతహలాడుతూ ఉంటారు. చర్మంపై మచ్చలు, ముడతలు, పింపుల్స్ లేకుండా ఉండాలి అనుకుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొరియన్స్ స్కిన్‌ చాలా వైరల్‌గా మారింది. కొరియన్ అమ్మాయిల చర్మం ఎంతో కాంతివంతంగా గ్లాస్‌లా మెరిసిపోతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ తమ వైపుకు తిప్పుకున్నారు. కొరియన్స్‌గా కనిపించాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటున్నారు. ఎన్నో బ్రాండ్స్ కూడా..

Korean Skin: ఇలా చేశారంటే కొరియన్ గ్లాస్ లాంటి చర్మం మీ సొంతం..
Korean Glowing Skin
Follow us on

చర్మం పట్ల ఎంతో ఆసక్తిని చూపిస్తారు మహిళలు. అందమైన చర్మం కోసం తహతహలాడుతూ ఉంటారు. చర్మంపై మచ్చలు, ముడతలు, పింపుల్స్ లేకుండా ఉండాలి అనుకుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొరియన్స్ స్కిన్‌ చాలా వైరల్‌గా మారింది. కొరియన్ అమ్మాయిల చర్మం ఎంతో కాంతివంతంగా గ్లాస్‌లా మెరిసిపోతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ తమ వైపుకు తిప్పుకున్నారు. కొరియన్స్‌గా కనిపించాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటున్నారు. ఎన్నో బ్రాండ్స్ కూడా మగువల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నాయి. అయితే ఇది భారత దేశ ప్రజలకు సూట్ కాక పోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే వెదర్, తీసుకునే ఫుడ్ కూడా వేరు. కానీ మీ ముఖాన్ని మాత్రం మిల మిలమని మెరిపించవచ్చు. ఇందు కోసం ఇలా చేయండి.

స్టీమింగ్:

ప్రతి రోజూ ముఖానికి స్టీమింగ్ అంటే ఆవిరి పడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండు ట్యాన్, దుమ్ము, మురికి వంటివి పోతాయి. చర్మ రంధ్రాలు కూడా తెరచుకుంటాయి. దీంతో చర్మం క్లీన్ అవుతుంది. చర్మ కణాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇలా రోజూ కనీసం 10 నిమిషాలు అయినా ఆవిరి పడుతూ ఉండటం వల్ల చర్మం తాజాగా అందంగా కనిపిస్తుంది. ఆవిరి పట్టకున్న అనంతరం ముఖాన్ని చేతి వేళ్లతో సున్నితంగా మర్దనా చేస్తే.. చర్మం మిలమిలమని మెరిసిపోతుంది.

డబుల్ క్లీన్:

ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణ బాడీ వాష్ కంటే ముఖాన్ని డబుల్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇందు కోసం క్లెన్సింగ్ వాటర్ ఉపయోగించండి. ఈ క్లెన్సింగ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత.. ఫేస్ వాష్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా డబుల్ పద్దతిలో ముఖాన్ని క్లీన్ చేస్తే.. చర్మంపై ఉండే మురికి, మచ్చలు పోతాయి. పొడి బారే చర్మం ఉన్నవారు ఆయిల్ కేర్ ప్రాడెక్ట్స్ ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి

టోనింగ్:

టోనింగ్ అంటే అర్థం అయ్యే ఉంటుంది. ఇది కూడా ముఖాన్ని క్లీన్ చేసే పద్దతిలో ఒకటి. చర్మాన్ని టోన్ చేయడం వల్ల.. చర్మ రంగు అనేది మెరుగు పడుతుంది. ఇందుకు మీరు రోజూ టోనర్ ఉపయోగించవచ్చు. మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్ ఉపయోగిస్తే ముఖం గ్లోగా కనిపిస్తుంది. కొరియన్స్ ఎక్కువగా టోనర్‌గా రైస్ వాటర్ ను యూజ్ చేస్తారు. మీరు కూడా బియ్యం కడిగిన నీళ్లను ఉపయోగించవచ్చు. ఎప్పుడో ఒకసారి కాకుండా.. ప్రతిరోజూ చర్మంపై టోనర్ ఉపయోగిస్తే మీరు ఊహించని రిజల్ట్స్ ఉంటాయి. మీ స్కిన్ కూడా కొరియన్స్ స్కిన్‌లా మెరుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..