Black Tea For Hair: తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే పట్టులాంటి కురులు..

తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, బ్లాక్ టీ, ఓమ గింజలను ఉపయోగించవచ్చు. దీని కోసం, 2 గ్లాసుల నీటిని వేడి చేయండి. దానికి 2 చెంచాల టీ పొడి, 2 చెంచాల ఓమక్కలు వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లలో 2 చెంచాల హెన్నా పౌడర్ వేసి బాగా కలపాలి.ఇప్పుడు దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి సుమారు గంటసేపు అలాగే ఉంచాలి.తర్వాత మీ జుట్టును నీళ్లతో కడగాలి.

Black Tea For Hair: తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే పట్టులాంటి కురులు..
Black Tea For Hair

Updated on: Dec 25, 2024 | 9:07 PM

నేటి బిజీ బిజీ జీవిన విధానం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా చిన్న వయస్సులోనే చాలా మం జుట్టురాలిపోవటం, నెరిసిన జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక తెల్లబడిన జుట్టును తిరిగి నల్లగా మార్చేందుకు నానా తంటాలు పడుతుంటారు. కొంత మంది డై, హెయిర్ కలర్ లాంటివి వాడుతుంటారు. అయితే, వాటిలో ఉపయోగించే కెమికల్స్ మీ జుట్టును మరింతగా పాడు చేస్తాయి. జుట్టు రాలిపోయే సమస్య కూడా మరింత తీవ్రం అవుతుంది. అయితే బ్లాక్ టీతో జుట్టు సమస్యలను పరిష్కరించుకోవచ్చునని మీకు తెలుసా..?

తెల్ల జుట్టును సహాజ పద్ధతిలో నల్లగా మార్చేందుకు టీ పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది. టీ ఆకులలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు దోహదం చేస్తుంది. దీంతో మీ జుట్టు మృదువుగా, మెరుస్తూ మంచి ఆరోగ్యవంతంగా మారుతుంది. బ్లాక్‌ టీ తయారీ కోసం 2 కప్పుల నీటిలో 4-5 స్పూన్ల టీ పొడి వేసుకుని ఆ నీటిని బాగా మరిగించాలి. చక్కటి డికాక్షన్‌ తయారైన తరువాత దానిని జుట్టుకు పట్టించి సుమారు అరగంట పాటు అలాగే ఉంచండి. తరువాత, సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

తెల్ల జుట్టు నల్లగా మారాలంటే బ్లాక్ టీని కాఫీ కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం 2 కప్పుల నీళ్లు తీసుకుని అందులో 4 చెంచాల టీ పొడి, 2-3 చెంచాల కాఫీ పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీరు చల్లబడిన తర్వాత, బ్రష్ సహాయంతో మీ జుట్టుకు అప్లై చేయండి. సుమారు 1 గంట పాటు జుట్టు మీద ఉంచండి. తర్వాత జుట్టును నీటితో కడగాలి. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, బ్లాక్ టీ, ఓమ గింజలను ఉపయోగించవచ్చు. దీని కోసం, 2 గ్లాసుల నీటిని వేడి చేయండి. దానికి 2 చెంచాల టీ పొడి, 2 చెంచాల ఓమక్కలు వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లలో 2 చెంచాల హెన్నా పౌడర్ వేసి బాగా కలపాలి.ఇప్పుడు దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి సుమారు గంటసేపు అలాగే ఉంచాలి.తర్వాత మీ జుట్టును నీళ్లతో కడగాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us