పకోడీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. కొంత మందికి పకోడీ ఫేవరేట్ స్నాక్. అలాగే ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు సులువుగా చేసే వాటిల్లో ఈ పకోడీ కూడా ఒకటి. పకోడీలను చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా ఉల్లి పకోడీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. రుచిగా కూడా ఉంటుంది. అలాగే వంకాయ బజ్జీ.. టమాటా బజ్జీ.. వంటివి చేస్తూ ఉంటారు. కానీ కూరగాయలన్నీ కలిపి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. మీకు నచ్చిన కూరగాయలు వేసుకుని చేయవచ్చు. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. మరి ఇంకెందుకు లేట్.. ఈ మిక్డ్స్ వెజిటేబుల్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
శనగ పిండి, పసుపు, ఇంగువ, వాము, కారం, ఉప్పు, మీకు నచ్చిన కూరగాయలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, సన్నని పచ్చి మిర్చి.
ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. కట్ చేసిన కూరగాయలు అన్నీ వేయాలి. ఆ తర్వాత శనగ పిండి, పసుపు, ఇంగువ, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, సన్నని పచ్చి మిర్చి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలపాలి. పకోడీలకు కావాల్సిన విధంగా పిండి ఉండాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే పకోడీలను వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఓ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ మీద వేసుకోవడం వల్ల ఎక్కువగా ఉన్న నూనె పీల్చేసుకుంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీలు సిద్ధం. వీటిని ఏదైనా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.