
చలికాలంలో వేడివేడిగా బెల్లం టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలామందికి బెల్లం వేసిన వెంటనే పాలు విరిగిపోతుంటాయి. ఈ సమస్య రాకుండా పర్ఫెక్ట్ బెల్లం టీ తయారు చేయడానికి కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. ఈ విధంగా చేస్తే పాలు విరిగిపోకుండా రుచికరమైన, ఆరోగ్యకరమైన బెల్లం టీ సిద్ధమవుతుంది. వివరంగా తెలుసుకుందాం..
బెల్లం టీ తయారీలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పాలు ఎప్పటికీ విరిగిపోవు. అనుసరించాల్సిన ముఖ్యమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీరు పోసి, అందులో తరిగిన అల్లం, యాలకులు, లవంగాలు లేదా పుదీనా ఆకులు వేసి మరిగించాలి. ఆ తర్వాత టీ పొడి వేసి రెండు నిమిషాలు బాగా మరగనివ్వాలి. నీరు మరిగిన తర్వాత స్టవ్ కట్టేయాలి లేదా మంటను చాలా తక్కువగా ఉంచాలి. టీ నేరుగా మరిగే పాలలో బెల్లం వేస్తే వేడికి పాలు విరిగిపోతాయి. కాబట్టి టీ కాస్త చల్లారిన తర్వాతే పాలు పోయాలి.
మరో పద్ధతి ఏమిటంటే, టీ ని నీటితో, పాలతో విడిగా మరిగించి దించే ముందు బెల్లం పొడి లేదా బెల్లం పాకం వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోయే అవకాశమే ఉండదు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: బెల్లంలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
శీతాకాలంలో రక్షణ: అల్లం, యాలకులు కలిపిన బెల్లం టీ శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు నుండి రక్షణ కల్పిస్తుంది.
శక్తినిస్తుంది: పంచదార లాంటి హానికరమైన రసాయనాలు లేకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
ఈ విధంగా సరైన పద్ధతిలో తయారు చేసుకున్న బెల్లం టీని ఉదయం పూట ఆస్వాదిస్తే ఆరోగ్యం, రుచి రెండు సొంతమవుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..