Turmeric: పసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ కల్తీదో, స్వచ్ఛమైనదో తెలుసుకోండి..

|

Dec 05, 2024 | 4:52 PM

పసుపు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎంతో ముఖ్యమైన పసుపులో కూడా కల్తీ జరుగుతుంది. కాబట్టి మీరు ఉపయోగించే పసుపు కల్తీదో లేక స్వచ్ఛమైనదో ఎలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకోండి..

Turmeric: పసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ కల్తీదో, స్వచ్ఛమైనదో తెలుసుకోండి..
Turmeric
Follow us on

ప్రస్తుత కాలంలో కల్తీ కానిది ఏమీ లేదు. తినేవి, తాగేవి అన్నీ కూడా కల్తీ అవుతున్నాయి. ఆఖరికి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పసుపుని కూడా కల్తీ చేస్తున్నారు. పసుపు అనేది దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. పసుపును ఫస్ట్ ఎయిడ్‌లా ఉపయోగిస్తారు. శరీరాన్ని బయట, లోపల క్లీన్ చేయడంలో పసుపు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఎలాంటి వంట అయినా పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. కానీ పసుపు కూడా కల్తీ కావడం వల్ల యూజ్ చేసేందుకు కూడా జనాలు భయ పడుతున్నారు. కల్తీ పసుపు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు వాడే పసుపు కల్తీతో లేక అసలైన పసుపులో ఇప్పుడు చెప్పే వాటి ద్వారా తెలుసుకోవచ్చు.

వాటెర్ టెస్ట్:

పసుపు మంచిదో కల్తీదో వాటర్ టెస్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు వేసి వదిలేయండి. పసుపు అడుగు భాగానికి చేరి.. నీరు లేత పసుపు రంగులోకి మారితే అది స్వచ్ఛమైన పసుపుగా గుర్తించవచ్చు. పసుపు నీటిలో కలవకుండా నీటిపైనే తేలితే అది కల్తీ పసుపుగా చెప్పొచ్చు.

పేపర్ టెస్ట్:

పేపర్స్‌తో కూడా కల్తీ పసుపును సులభంగా గుర్తించవచ్చు. ఒక టిష్యూ పేపర్ మీద పసుపు వేసి ప్రెస్ చేయండి. టిష్యూ పేపర్‌కు నూనె మరకలు కనిపిస్తే అది కల్తీ పసుపుగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

వెనిగర్:

వెనిగర్ ఉపయోగించి కూడా కల్తీ పసుపును కనిపెట్టవచ్చు. ఒక చిన్న గ్లాస్‌లోకి వెనిగర్ తీసుకోండి. అందులో కొద్దిగా పసుపు వేసి కలపండి. స్వచ్ఛమైన పసుపు.. రంగు మారదు. అదే కల్తీ పసుపు అయితే మాత్రం గులాబీ రంగులోకి మారుతుంది.

సువాసన:

పసుపు నుంచి ఎప్పుడూ మంచి సువాసన వస్తుంది. అదే కృత్రిమంగా తయారు చేసిన పసుపుకు మాత్రం ఎలాంటి సువాసన రాదు. దాని బట్టి కూడా పసుపు ఎలాంటిదో చెప్పవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..