
ఇంట్లో ఉన్న పాత్రలు మాడిపోయాయా?.. వాటిపై ఉన్న నల్లటి మొండి మరకలు గంటల తరబడి స్క్రబ్బర్‌తో గట్టిగా రుద్దినా పోవట్లేదా అయితే, మాడిన పాత్రలను వదిలించుకోవడానికి ఇకపై అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు.. వంట నిపుణులు ప్రకారం.. ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనే కేవలం కొన్ని నిమిషాల్లో ఈ మొండ మరకలను పొగొట్టి పాత్రలను కొత్తవాటిలా మెరిపించవచ్చని సూచిస్తున్నారు. అదెలానో చూద్దాం.
బేకింగ్ సోడా – తెల్ల వెనిగర్ మ్యాజిక్
మాడిన మరకలను పొట్టడంలో సాధారణ డిటర్జెంట్ కంటే బేకింగ్ సోడా, వెనిగర్ పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మాడిన పాత్రలో ఒక కప్పు నీరు, ఒక కప్పు వెనిగర్ పోసి బాగా మరిగించాలి. నీరు మరిగాక స్టవ్ ఆపేసి, అందులో రెండు చెంచాల బేకింగ్ సోడా వేయాలి. దాన్ని బాగా కలిపి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటిని పారబోసి, సాధారణ స్క్రబ్బర్‌తో తేలికగా రుద్దితే సరిపోతుంది. క్షణాల్లో మరకలు పోయి.. కొత్తదానిలా మెరిపోతుంది.
నిమ్మకాయ – ఉప్పు కాంబినేషన్
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ సహజంగానే మొండి మరకలను తొలగించి, పాత్రలకు పూర్వపు మెరుపును అందిస్తుంది. కాబట్టి దీంతో ఈజీగా మరకలను దూరం చేయవచ్చు. ఇందుకోసం పాత్రలో తగినన్ని నీరు తీసుకుని, అందులో 2-3 నిమ్మకాయ ముక్కలు, రెండు చెంచాల ఉప్పు వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. వేడి నీటి వల్ల మాడిన పొర మెత్తబడుతుంది. ఆ తర్వాత నీటిని పారబోసి, ఉడికిన నిమ్మ తొక్కతో పాత్రపైను బాగా రుద్దితే మరకలు క్షణాల్లో మాయం అవుతాయి.
అల్యూమినియం ఫాయిల్ చిట్కా
మాడిన, మొండి మరకలను పొగొట్టడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ఇందుకోసం మీరు మాడిన ప్రదేశంలో కొద్దిగా బేకింగ్ సోడా, లిక్విడ్ డిష్‌వాష్ సబ్బు వేసి, కొద్దిగా గోరువెచ్చని నీరు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు స్క్రబ్బర్‌కు బదులుగా.. అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను ఒక చిన్న బంతిలా చుట్టి, దాంతో పాత్రపై రుద్దాలి. తర్వాత నీటితో కడిగితే చాలా ఆ మాడిన మరకలు క్షణాల్లో తొలగిపోతాయి.
అయితే పాత్ర మాడిన వెంటనే ఎప్పుడూ స్క్రబ్బర్‌తో పెట్టి గట్టిగా రుద్దవద్దు.. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా పాత్రల కోటింగ్ పాడైపోతుంది. మీరు నెక్ట్స్ టైం వంట చేస్తే అది త్వరగా మాడిపోతుంది. కాబట్టి, పైన పేర్కొన్న పద్ధతులలో ఏదో ఒకదానిని ఉపయోగించి ముందుగా మాడిన భాగాన్ని మెత్తబరిచిన తర్వాతే శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.