
బరువు తగ్గాలంటే కేవలం జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తుతే సరిపోదు. అందుకు తగ్గట్టు ఫర్ఫెక్ట్ డైట్ కూడా మనం మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది జిమ్‌కు వెళ్తూ, వ్యాయామాలు చేస్తున్నప్పటికీ బరువు తగ్గడం లేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే కేవలం 56 రోజుల్లోనే దాదాపు 9 కిలోలు బరువు తగ్గిన ఓ ఫేమస్ ఇన్‌ప్లూయెన్సర్ తాను పాటించిన డైట్, తను చేసిన వర్కౌంట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వాటిని ఫాలో అవ్వడం ద్వారా మీరు కూడా ఈజీగా మీ బరువును తగ్గించుకోవచ్చు.
తాన్యా సింగ్ అనే ఇన్‌ప్లూయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను 56 రోజుల్లో 75 కిలోల నుండి 66 కిలోలకు తగ్గానని.. అందుకూ ఆమె ఎలాంటి డైట్ ఫాలో అయింది, ఎలాంటి వర్కౌట్స్ చేసిందో పంచుకుంది. తాన్య తన డైట్ ప్లాన్ 4 స్టేజ్‌లగా ఉదయం, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ తీసుకున్నట్టు తెలిపింది
తాన్యాసింగ్ చెప్పిన డైట్ ప్లాన్:
మార్నింగ్: మార్నింగ్ జిమ్‌కి వెళ్లేముందు 4 ఉడకబెట్టిన గుడ్లు తినేదానన్ని ఆమె తెలిపింది. ఇందుకోసం రోజు కొత్త కొత్త వెరైటీగా వాటిని వండుకునేదాన్నినని చెప్పుకొచ్చింది
మద్యాహ్నం: మధ్యాహ్న భోజనంలోకి 2 రొట్టెలు, బెండకాయ కూర, ఒక కప్పు రాజ్‌మా, కీరదోసకాయ, క్యారెట్ ముక్కలు తీసుకున్న ఆమె చెప్పింది. వీటిలో కాంప్లెక్స్ కార్బ్స్, ప్లాంట్ ప్రొటీన్, ఫైబర్ సమతుల్యంగా ఉంటాయని ఆమె తెలిపింది.
సాయంత్రం: ఇక సాయంత్రం స్నాక్‌లోకి తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్ ఉండేలా కూరగాయలు కలిపిన ఎగ్ భుర్జీ తినేదానన్ని తెలిపింది.
నైట్: ఇక డే ఎండింగ్లో రాత్రి భోజనం కోసం ఉల్లిపాయలు, పచ్చి చట్నీతో పాటు 4 రోస్టెడ్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకునేదాన్నని తెలిపింది.
తాన్యా జిమ్ వర్కౌట్ ప్లాన్
జిమ్ వర్కవుట్: మార్నింగ్ జిమ్‌లో ఆమె ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ తర్వాత ఇన్వర్టెడ్ రోస్, ఫోర్‌ఆర్మ్ ప్లాంక్స్, బార్‌బెల్ బెంట్-ఓవర్ రోస్, రొమేనియన్ డెడ్‌లిఫ్ట్స్ వంటి కొన్ని బాడీవెయిట్ మరియు స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు చేసింది. అంతేకాదు సాయంత్రం వేళ్లల్లో యాక్టీవ్‌గా ఉండేందుకు గోల్ఫ్ ఆడటం, రోజూ 10,000 అడుగులు పూర్తి చేయడం తన అలవాటు చేసుకున్నట్టు తెలిపింది. మీరు కన్సీస్టెన్‌సీతో సరైన డైట్ ఫాలో అవ్వడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చని ఆమె తెలిపింది.
వీడియో చూడండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.