Tea: టీని ఈ సమయంలో తాగితే ఎన్ని లాభాలో.. డోంట్ మిస్..

|

Jul 11, 2024 | 2:08 PM

పొద్దు పొద్దున్నే ఒక ఒక సిప్ టీ గొంతులో వేయక పోతే మనసు మనసులా ఉండదు. భారత దేశంలో మోస్ట్ పాపులర్ డ్రింక్ ఏదంటే టీ అనే చెప్తారు. కొంత మంది బెడ్ టీ తాగితే.. మరికొంత మంది బ్రెష్ చేశాక.. ఇంకెంత మంది టిఫిన్ చేశాక.. ఇలా ఎవరి ఇష్టం బట్టి వాళ్లు తాగుతూ ఉంటారు. ఉదయం, సాయంత్రం టీ ఖచ్చితంగా తాగాల్సిందే. లేదంటే మనసు మనసులా ఉండదు. ఇంకొంత మంది ఏ సమయంలోనైనా తాగుతూనే ఉంటారు. కానీ టీ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో..

Tea: టీని ఈ సమయంలో తాగితే ఎన్ని లాభాలో.. డోంట్ మిస్..
Milk Tea
Follow us on

పొద్దు పొద్దున్నే ఒక ఒక సిప్ టీ గొంతులో వేయక పోతే మనసు మనసులా ఉండదు. భారత దేశంలో మోస్ట్ పాపులర్ డ్రింక్ ఏదంటే టీ అనే చెప్తారు. కొంత మంది బెడ్ టీ తాగితే.. మరికొంత మంది బ్రెష్ చేశాక.. ఇంకెంత మంది టిఫిన్ చేశాక.. ఇలా ఎవరి ఇష్టం బట్టి వాళ్లు తాగుతూ ఉంటారు. ఉదయం, సాయంత్రం టీ ఖచ్చితంగా తాగాల్సిందే. లేదంటే మనసు మనసులా ఉండదు. ఇంకొంత మంది ఏ సమయంలోనైనా తాగుతూనే ఉంటారు. కానీ టీ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో టీ తాగడం వల్ల మంచి లాభాలే ఉన్నాయి. టీ తాగడానికి సరైన సమయం కూడా ఉంటుంది. మరి టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు, ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ తాగడం వల్ల లాభాలు:

ఒత్తిడి, ఆందోళన నుంచి రిలీఫ్ ఇవ్వడంలో టీ చక్కగా హెల్ప్ చేస్తుంది. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. దానికి కూడా సరైన సమయం ఉంటుంది. టీ తాగడం వల్ల కూడా అలసట దూరమై ఎనర్జీ వస్తుంది. మూడ్ మొత్తం మారిపోతుంది. ఒళ్లు నొప్పులు కూడా తగ్గుతాయి. అజీర్తి సమస్యను నివారిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపు, నడుము నొప్పులు తగ్గుతాయి. బ్రెయిన్ యాక్టివ్‌గా పని చేస్తుంది. నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

టీ తాగడం వల్ల నష్టాలు:

టీ తాగడం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. టీ ఎక్కువగా తాగితే గుండెల్లో మంట వస్తుంది. మలబద్ధకం ఏర్పడుతుంది. అజీర్తి, గ్యాస్ ఏర్పడతాయి. డీహైడ్రేషన్ ఎక్కువగా ఏర్పడుతుంది. మైగ్రేన్‌ ఏర్పడుతుంది. క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఏ సమయంలో తాగాలి?

టీ తాగడానికి కూడా ప్రత్యేకమైన సమయం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టీని ఉదయం లేదా సాయంత్రం తాగుతూ ఉంటారు. రెండు పూటలు తాగడం మంచిదే. కానీ మితంగా తాగాలి. అయితే ఉదయం పరగడుపున తాగడం కంటే నీళ్లు తాగిన అరగంట తర్వాత తాగాలి. ఇలా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..