fish gravy: చేపల పులుసు ఎన్ని రోజులు తినొచ్చు? ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!

చేపల పులుసు సాధారణంగా వండిన మరుసటి రోజు తింటేనే ఎక్కువ రుచిగా ఉంటుంది. చేపల పులుసు మరుసటి రోజు తింటే అద్భుతమైన రుచిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ, ఫ్రిజ్‌లో పెట్టిన చేపల పులుసు ఎన్ని రోజులు తినవచ్చు..? ఎలా నిల్వ చేయాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న చేపల కూర తింటే ఏమౌతుంది అనే విషయాలను తప్పక తెలుసుకోవాలి.

fish gravy: చేపల పులుసు ఎన్ని రోజులు తినొచ్చు? ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!
Fish Gravy
Image Credit source: tv9 telugu

Updated on: Apr 25, 2026 | 1:28 PM

అన్ని రకాల వంటకాల కంటే చేపల పులుసుకు ఒక ప్రత్యేకత ఉంది. వండిన వెంటనే తినడం కంటే, ఒక రోజు నిల్వ ఉన్న పులుసు తింటే ఆ రుచే వేరు. అందుకే చాలా మంది ఎక్కువ మొత్తంలో పులుసు వండి ఫ్రిజ్‌లో దాచుకుంటారు. అయితే, అది ఎన్ని రోజులు సురక్షితంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చేపల పులుసు (Fish Gravy) ని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు. దానిని తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ చూద్దాం..

సాధారణంగా చేపల పులుసును ఫ్రిజ్‌లో 3 నుండి 4 రోజుల వరకు భద్రపరచుకోవచ్చు. అంతకు మించితే ప్రోటీన్లు విచ్ఛిన్నమై ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి 4 రోజులు దాటిన తర్వాత ఆ పులుసును తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ మీరు డీప్ ఫ్రీజర్‌లో ఉంచితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. కానీ రుచి తగ్గిపోతుంది. అంతేకాదు.. చేపల పులుసులో చింతపండు ఎక్కువగా వాడతాము. ఇది సహజ సిద్ధమైన ప్రిజర్వేటివ్‌లా పనిచేసి పులుసు త్వరగా పాడవకుండా చూస్తుంది.

పులుసును వేడివేడిగా ఫ్రిజ్‌లో పెట్టకండి. ఇది ఫ్రిజ్ లోపల తేమను పెంచి ఇతర పదార్థాలు పాడయ్యేలా చేస్తుంది. ఒకవేళ మీరు చేపల కూర ఫ్రిజ్‌లో పెడుతున్నట్టయితే, గాజు లేదా మంచి నాణ్యత గల ప్లాస్టిక్ ఎయిర్ టైట్ డబ్బాలను వాడండి. దీనివల్ల చేపల వాసన ఫ్రిజ్‌లోని ఇతర పదార్థాలకు రాకుండా ఉంటుంది. ఫ్రిజ్ నుండి తీసిన పులుసును నేరుగా అన్నంలో వేసుకోకండి. మీకు ఎంత కావాలో అంత మాత్రమే వేరే గిన్నెలోకి తీసుకుని వేడి చేయండి. మొత్తం పులుసును మాటిమాటికీ వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు నశించి, చేప ముక్కలు చెదిరిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఒకవేళ పులుసు పైన తెల్లటి పొరలాగా వచ్చినా, పులుసు జిగటగా మారినా లేదా వింత వాసన వస్తున్నా అది పాడైపోయిందని అర్థం. అలాంటి ఆహారం తింటే వాంతులు, విరేచనాలు వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చేపల పులుసు రుచిగా ఉండాలంటే నిల్వ చేయడం మంచిదే, కానీ అది ఆరోగ్య పరిమితులకు లోబడి ఉండాలి. వీలైనంత వరకు 2-3 రోజుల్లోనే పూర్తి చేయడం ఉత్తమం.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us