
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి ఇబ్బందులు ఎదురు అవుతాయి. అయితే ఈ సమయంలో ఈ రుచికరమైన అల్లం మురబ్బ తినడం వలన ఇది అనేక సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుంది. అంతే కాకుండా, అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

కావాల్సిన పదార్థాలు : తరుమిన అల్లం ముక్కలు కప్పు, బెల్లం తురుము కప్పు, పంచదార అరకప్పు, యాలకుల పొడి, నిమ్మరసం, తేనె. వీటన్నింటితో చాలా సులభంగా అల్లం మురబ్బ తయారు చేసుకోవచ్చును.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా అల్లం శుభ్రంగా కడిగి, నీరు పదన లేకుండా తుడుచుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అందులో బెల్లం,చక్కెర, అల్లం అన్నీ వేసి మెత్తడి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో నీళ్లు పోసి, పౌడర్ వేసి మెల్లగా కలుపుతూ పెట్టుకోవాలి. అందులో యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల వరకు మంచిగా కలుపుతూ పాకం వచ్చేలా చేసుకోవాలి. అది పాకంలా వస్తే, అల్లం మురబ్బ చాలా అద్భుతంగా, రుచికరంగా ఉంటుంది.

ఇప్పుడు పాకం పూర్తిగా సిద్ధం అయిన తర్వాత, ఒక ప్లేట్ తీసుకొని, అందులో మంచిగా వేసుకోవాలి. తర్వాత అందులో దానిపై చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి, మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని గాలి చొరబడి బాక్స్‌లో వేసి నిల్వ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ అల్లం మురబ్బ తయారీ రెడీ.