
రంగుల పండుగ హోలీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే కెమికల్ కలర్స్, సూర్యరశ్మి, దుమ్ము కారణంగా చర్మం పొడిబారడం, అలర్జీలు, మొటిమలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హోలీ తర్వాత సరైన స్కిన్‌కేర్ రొటీన్ పాటించడం చాలా ముఖ్యం. హోలీ ఆడిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం, చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీని వల్ల రంగులు ఈజీగా తొలగిపోతాయి. గాఢత తక్కువ ఉన్న ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌తో చర్మాన్ని క్లీన్ చేసుకోండి. దీంతో చర్మంపై మిగిలి ఉన్న రంగు తొలగిపోతుంది. ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ లేదా ఫోమ్ క్లెన్సర్‌తో ముఖాన్ని క్లీన్ చేయండి. దీంతో చర్మం పూర్తిగా క్లీన్ అవుతుంది. రంగులు తొలగుతాయి.
రంగులు తొలగిన తర్వాత తేలికపాటి స్క్రబ్‌ను ఉపయోగించండి. సున్నితంగా స్క్రబ్ చేస్తే చర్మం అందంగా మారుతుంది. గట్టిగా రుద్దడం వల్ల చర్మం దెబ్బతింటుంది. హోలీ ఆడిన తర్వాత ముఖానికి కలబంద లేదా కీరదోస మాస్క్ అప్లై చేసుకోండి. ఈ మాస్క్‌లు చర్మాన్ని చల్లగా ఉంచుతాయి. సున్నితమైన టోనర్‌ను ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. హెలీ రంగులు తొలగుతాయి. దీని కోసం ముందుగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. కఠినమైన సబ్బులు వాడకుండా, మైల్డ్ ఫేస్‌వాష్ లేదా క్లెన్సర్ ఉపయోగించడం మంచిది. చర్మాన్ని రుద్దకండి; మృదువుగా శుభ్రం చేయాలి.
రంగులు చర్మంలోని సహజ తేమను తగ్గిస్తాయి. అందుకే ఆలొవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది చర్మాన్ని చల్లబరచి, మృదువుగా ఉంచుతుంది. ఇప్పుడు పెరుగు, పసుపు, తేనె మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ తయారు చేసుకుని ఉపయోగించండి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా కాంతిని కూడా ఇస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న భాగంలో పరీక్షించుకోవాలి.
హోలీ తర్వాత కూడా సన్‌స్క్రీన్ వాడటం ఆపకండి. బయటకు వెళ్లే ముందు SPF ఉన్న సన్‌స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇది చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది. చర్మ ఆరోగ్యానికి లోపల నుండి హైడ్రేషన్ అవసరం. రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగడం మంచిది. ముఖ్యంగా చర్మంలో ఎర్రదనం, మంట, అలర్జీ ఎక్కువగా ఉంటే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. గోర్లతో గోకడం, బ్లీచింగ్ లేదా కఠినమైన ట్రీట్మెంట్లు వెంటనే చేయకూడదు. హోలీ ఆనందం ముగిసినా, చర్మ సంరక్షణ కొనసాగాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..