Coffee: కాఫీ తాగే వారికి అలర్ట్.. రోజులో ఎంత కాఫీ తాగాలో తెలుసా? ఎక్కువ తాగితే జరిగేది ఇదే!

అలసటను పోగొట్టుకుని, తక్షణ ఉత్సాహాన్ని పొందడానికి చాలా మంది స్ట్రాంగ్ టీ లేదా కాఫీలను తాగుతుంటారు. కానీ, ఈ ఉత్సాహానికి కారణమైన కెఫీన్ శ్రుతిమించితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒక రోజులో మనం ఎంత కాఫీ తాగాలి, కాఫీ ఎక్కువగా తాగితే ఎలాంటి ఆరోగ్య సమ్యలు వస్తాయో తెలుసుకుందాం.

Coffee: కాఫీ తాగే వారికి అలర్ట్.. రోజులో ఎంత కాఫీ తాగాలో తెలుసా? ఎక్కువ తాగితే జరిగేది ఇదే!
Caffeine Side Effects

Updated on: May 17, 2026 | 12:27 PM

పని ఒత్తిడి, ఇంట్లో టెన్షన్స్ ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి చాలా మంది కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. మరికొందరైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కనీసం 3-4 సార్లైనా కాఫీ తాగుతూ. మరికొందరైతే సాయంత్రం 4 అవ్వగానే కాఫీ తాగుతూ ఉంటారు. అయితే ఇలా తరచూ కాఫీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎంతమందికి తెలుసు? అవును కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిల్లో కెఫీన్ సహజంగానే ఉంటుంది. ఇది మన నరాల వ్యవస్థను ప్రేరేపించి, తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతుంది. అయితే దీని వల్ల మనం ఉపశమనం కలిగిన ఫీలింగ్ వస్తుంది. అయితే దీనిని ఎంత మింతంగా తీసుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఒక రోజులో ఎంత కాఫీ తీసుకోవం సరక్షితం

సాధారణంగా ఆరోగ్యంగా ఉండే ఒక వ్యక్తి రోజుకు 400 mg వరకు కెఫీన్ తీసుకోవడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపు 3 నుండి 4 కప్పుల టీ లేదా కాఫీ తాగవచ్చు. గర్భిణీ స్త్రీలు, రక్తపోటు ఉన్నవారు, ఆందోళన సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ మోతాదును ఇంకా తగ్గించాలని చెబుతున్నారు. అంటే రోజుకు ఒక సారి లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం అంటున్నారు.

కాఫీ ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి

నిద్రలేమి: మెదడులో నిద్రను ప్రేరేపించే ‘అడెనోసిన్’ అనే రసాయనాన్ని కెఫీన్ అడ్డుకుంటుంది. ఇది నిద్ర నాణ్యతను తగ్గించి, ఇన్సోమ్నియా నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది.

గుండె వేగం పెరగడం: కెఫీన్ తాత్కాలికంగా గుండె వేగాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు , గుండె జబ్బులు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. కాబట్టి వీలైనంత వరకు ఈ సమస్యలు ఉన్నవారు కాఫీ లేదా టీకి దూరంగా ఉండడం మంచిది.

మానసిక ఒత్తిడి: కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, చికాకు, చేతులు వణకడం, అకస్మాత్తుగా కోపం రావడం వంటివి జరగవచ్చు. అందుకే ఎక్కువగా కాఫీ లేదా టీ అలవాటు చేసుకోవద్దు.

జీర్ణ సమస్యలు: కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా అసిడిటీ, గుండెల్లో మంట, కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన మోతాదులో కాఫీ తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us