ఉదయాన్నే ఈ కషాయం తీసుకున్నారంటే..మీ బ్లడ్ షుగర్ కంట్రోల్.. ఆయుర్వేదంలో అద్భుత ఔషధం!

నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మందులు వాడటంతో పాటు ప్రకృతి ప్రసాదించిన కొన్ని సహజసిద్ధమైన మూలికలను ఉపయోగించడం ద్వారా షుగర్‌ను సులభంగా నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటువంటి వాటిలో జామ ఆకులు అత్యంత ప్రభావవంతమైనవి. జామ ఆకుల ఔషధ గుణాలను, వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఉదయాన్నే ఈ కషాయం తీసుకున్నారంటే..మీ బ్లడ్ షుగర్ కంట్రోల్.. ఆయుర్వేదంలో అద్భుత ఔషధం!
Guava Leaf Tea For Diabetes

Updated on: Sep 02, 2026 | 7:12 AM

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున లేత జామ ఆకులను నమలడం లేదా వాటితో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ క్రమంగా అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ మాత్రమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి జామ ఆకులు ఒక సహజసిద్ధమైన ఆయుర్వేద పరిష్కారంగా నిలుస్తాయి. జామ ఆకులు బ్లడ్ షుగర్‌ను ఎలా నియంత్రిస్తాయి?

గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి: జామ ఆకులలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్లు శరీరంలో ఆల్ఫా-గ్లూకోసిడేస్ అనే ఎంజైమ్ చర్యను మందగింపజేస్తాయి. దీనివల్ల మనం తినే ఆహారంలోని పిండి పదార్థాలు త్వరగా గ్లూకోజ్‌గా మారవు. ఫలితంగా భోజనం చేసిన తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.

ఈ ఆకులు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా సహాయపడతాయి. విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి ఆందోళనను, అలసటను నివారిస్తాయి.

ఇవి కూడా చదవండి

జామ ఆకులను ఎలా ఉపయోగించాలి?: 5-6 లేత జామ ఆకులను శుభ్రంగా కడిగి, 2 గ్లాసుల నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా మరగబెట్టాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించిన తర్వాత ఆ నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఉదయం పరగడుపున ఈ టీ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. లేదంటే, 3-4 లేత జామ ఆకులను బాగా కడిగి, ఉదయం ఖాళీ కడుపుతో నమిలి ఆ రసాన్ని మింగవచ్చు.
ఇలా చేయటం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు సైతం అనేకం ఉన్నాయి.

డయాబెటిస్‌నే కాకుండా, జామ ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్ సమస్యలను నివారిస్తాయి. వీటిలోని కాంపౌండ్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా జామ ఆకుల కషాయం ఎంతో మేలు చేస్తుంది.

గమనిక: అయితే ఇది సహజంగా డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి ఉత్తమైనదే అయినప్పటికీ.. పూర్తిగా డయాబెటీస్‌ను తగ్గించలేదు. కాబట్టి వైద్యుల సలహా మేరకు ఇతర మందులను కూడా వాడడం ముఖ్యం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us