ఉదయాన్నే ఏది పడితే అది తినొద్దు.. బరువు తగ్గి.. స్టామినా పెరగాలనుకుంటే దీన్ని ట్రై చేయండి..

ప్రస్తుత తీరికలేని జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలలో గోధుమ రవ్వ (దలియా) ఒకటి. గోధుమ రవ్వలో ప్రొటీన్లు, ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. గోధుమ రవ్వను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోండి..

ఉదయాన్నే ఏది పడితే అది తినొద్దు.. బరువు తగ్గి.. స్టామినా పెరగాలనుకుంటే దీన్ని ట్రై చేయండి..
Wheat Rava
Image Credit source: AI Photo

Updated on: May 29, 2026 | 12:27 PM

ప్రస్తుత తీరికలేని జీవనశైలిలో మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అత్యవసరం. కానీ.. ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకోవడానికి చాలామందికి సమయం ఉండదు. మనం తినే ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్లు, హోల్ గ్రెయిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాలు శరీరానికి చాలా ప్రయోజనకరమైనవి.. అలాంటి అద్భుతమైన ఆహారాలలో గోధుమ రవ్వ (Wheat Rava/Dalia) ఒకటి. గోధుమ రవ్వలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. దీనిలో పీచుపదార్థం (Fiber), ఐరన్, విటమిన్-B సమృద్ధిగా ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి, ఆకలిని అదుపులో ఉంటుంది. చాలామంది దీనిని పెద్దగా తీసుకోకపోయినా, బరువు పెరగడానికి, ఆరోగ్యకరమైన కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. దీనిని అల్పాహారంగా, మధ్యాహ్న భోజనంలో లేదా రాత్రి భోజనంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనిద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

గోధుమ రవ్వలో ఫైబర్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ ఫైబర్లు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. దీనివల్ల అనవసరమైన ఆహార కోరికలు తగ్గుతాయి, తద్వారా జంక్ ఫుడ్ తినకుండా ఉండవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. అంతేకాకుండా, మలబద్ధకం సమస్యను నిర్మూలించడంలో కూడా గోధుమ రవ్వ ఎంతగానో దోహదపడుతుంది. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

షుగర్ ఉన్న వ్యక్తులకు గోధుమ రవ్వ సరైన ఆహారం. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్ నియంత్రణను క్రమబద్ధీకరిస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులువవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంలో గోధుమ రవ్వను చేర్చుకోవడం మంచిది.

రోజూ గోధుమ రవ్వ తినడం వలన శరీర సామర్థ్యం పెరుగుతుంది, మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. ఉదయాన్నే అల్పాహారంగా దీన్ని తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. గోధుమ రవ్వలోని అధిక ఫైబర్, ప్రొటీన్లు దీనిని ఒక సూపర్ ఫుడ్‌గా మారుస్తాయి.

కాబట్టి, మీరూ గోధుమ రవ్వను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇంట్లో వారు తినడానికి ఇష్టపడకపోతే, విభిన్న రకాల వంటకాలు చేసి పెట్టొచ్చు.. గోధుమరవ్వ ఉప్మా, జావ లాంటివి చేసుకుని తినొచ్చు.. ఇంకా కిచిడి కూడా వండుకుని తినొచ్చు.. ఇలాంటి ఆరోగ్య చిట్కాలను పాటించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us