Sweet Corn Bonda Recipe : మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా చౌకగా లభించే.. ఒకమంచి బలమైన ఆహార పదార్ధం.. దీని గింజలను పచ్చిగా కొంతమంది తింటే.. ఉడకబెట్టుకుని, కాల్చుకుని కొంతమంది తింటారు. ఇక మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ ఫ్లేక్స్’ తయారుచేస్తారు. లేత ‘బేబీకార్న్’ జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. అయితే ఈ మొక్కజొన్న గింజలతో మంచి స్నాక్ ఐటెం కూడా చేసుకోవచ్చు.. ఈరోజు సాయంత్రం స్నాక్స్.. స్వీట్ కార్న్ బోండా తయారీ విధానం తెలుసుకుందాం..!
స్వీట్ కార్న్ గింజలు : 2 పెద్ద కప్పులు ( 2 మొక్క జొన్న పొత్తులు)
శెనగపిండి : 1 కప్పు
బియ్యం పిండి : 1/2 కప్పు
ఉల్లిపాయలు : 2 (చిన్న ముక్కలు)
పచ్చిమిర్చి : 6 (,చిన్న ముక్కలు)
కొత్తిమీర :1 కట్ట
పుదీనా : 1 కట్ట
అల్లం వెల్లుల్లి ముద్ద : 1 స్పూన్
గరం మసాల : 1 స్పూన్
కారం : 1 స్పూన్
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి సరిపడా
స్వీట్ కార్న్ గింజల్ని బాగా మెత్తగా కాకుండా, కొంచెం పలుకులుగా మిక్సీ వేసుకోవాలి. ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలతో పాటు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకుని కలుపుకోవాలి.. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాల, కారం, ఉప్పు వేసుకుని బాగా కలిపి టెస్ట్ చూసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. (ఇందులో నీరు వేయకూడదు)
ఇంతలో శనగపిండి బియ్యంపిండి కొంచెం కారం ఉప్పు కలిపి కలిపి బోండా వేయడానికి తోపు రెడీ చేసుకోవాలి.
అనంతరం గ్యాస్ స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. దానిలో బొండాలు వేయించడానికి సరిపడరా నూనె వెయ్యాలి.. నూనె వేడి ఎక్కిన తర్వాత స్వీట్ కార్న్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని శనగపిండి లో ముంచి నూనెలో వేయాలి. మీడియం మంటపై బొండాలు వేయించి .. గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత టిస్యూ మీద తీసుకోవాలి.. నూనె ఉంటె అవి పీల్చుకుంటాయి. ఈ స్వీట్ కార్న్ బొండాలు వేడిగా తింటే చాలా బాగుంటాయి. వీటికి కాంబినేషన్ గా అల్లం పచ్చడి.. లేదా టమోటో సాస్ ఉంటె ఆహా ఏమి రుచి అంటారు..
గమనిక : స్టఫింగ్ పెట్టుకునే స్వీట్ కార్న్ ని ఉండలుగా గట్టిగా చుట్టుకోవాలి. లేకపోతే వేయించేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. అంతేకాదు ఉండలు పెద్దగా ఉండకూడదు.. ఇక మంట కూడా పెద్దదిగా పెట్టకూడదు.
Also Read: