Poha Fingers: పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..

| Edited By: Shaik Madar Saheb

Oct 19, 2024 | 11:59 PM

అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కానీ అటుకులతో పోహా లేదంటే పులిహోర, మిక్చర్ వంటివి మాత్రమే తయారు చేస్తారు. కానీ అటుకులతో అదిరిపోయే స్నాక్ తయారు చేసుకోవచ్చు. ఈ రుచి చికెన్‌ని సైతం డామినేట్ చేస్తాయి. చాలా ఈజీగా చేయవచ్చు. తక్కువ సమయం మాత్రమే పడుతుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్లు వీటిని రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ ఇలాగే కావాలి అంటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్‌లా పెట్టొచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా..

Poha Fingers: పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
Poha Fingers
Follow us on

అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కానీ అటుకులతో పోహా లేదంటే పులిహోర, మిక్చర్ వంటివి మాత్రమే తయారు చేస్తారు. కానీ అటుకులతో అదిరిపోయే స్నాక్ తయారు చేసుకోవచ్చు. ఈ రుచి చికెన్‌ని సైతం డామినేట్ చేస్తాయి. చాలా ఈజీగా చేయవచ్చు. తక్కువ సమయం మాత్రమే పడుతుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్లు వీటిని రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ ఇలాగే కావాలి అంటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్‌లా పెట్టొచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి క్రిస్పీగా, సాఫ్ట్‌గా, క్రంచీగా ఉంటాయి. మరి ఈ పోహా ఫింగర్స్‌ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దం.

పోహా ఫింగర్స్‌కి కావాల్సిన పదార్థాలు:

పోహా, ఆలు గడ్డ, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, మైదా, చిల్లీ ఫ్లేక్స్, ఆయిల్

ఇవి కూడా చదవండి

పోహా ఫింగర్స్ తయారీ విధానం:

ముందుగా బంగాళ దుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అటుకును మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని నీటిలో వేసి గట్టిగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, మైదా, చిల్లీ ఫ్లేక్స్, అన్నీ వేసి ముద్దలాగా కలపాలి. కావాలంటే కొద్దిగా వాటర్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీటిని ఫింగర్స్ షేపులో కానీ.. మీకు నచ్చి షేపుల్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పోహా ఫింగర్స్ సిద్ధం.