మఫిన్స్ ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని అనేక ఫ్లేవర్స్‌తో తయారు చేస్తూ ఉంటారు. కానీ వీటిని నాన్ వెజ్ రెసిపీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఒక్కసారి ఇలా రుచి చూశారంటే పిల్లలు అస్సలు వదిలి పెట్టరు. చాలా రుచిగా ఉంటాయి. వీటిని మటన్ లేదా చికెన్ కీమాతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మటన్ కీమా ఎగ్ మఫిన్స్‌ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కాస్త ప్రాసెస్‌గా ఉన్నా ఒక్కసారి చేశారంటే మళ్లీ ఈజీగా చేయవచ్చు. మరి ఈ మటన్ కీమా ఎగ్ మఫిన్స్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మటన్ కీమా, ఎగ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బటర్, ఆయిల్.
ముందుగా కీమా కర్రీని వండుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన కీమా వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మసాలా, మిరియాల పొడి కొద్దిగా అన్నీ వేసి ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడ్డాక కోడి గుడ్లు చితక్కొటి అంతా కలిసేలా వాసన పోయేంత వరకు ఉడికించాలి. చివరగా బటర్ కొద్దిగా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసి అన్నీ కలిపాలి.
కర్రీ చల్లారిపోయాక మఫిన్స్ మౌల్స్‌లోకి వేసుకోవాలి. ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు ఉడికిస్తే వేడి వేడి మటన్ కీమా ఎగ్ మఫిన్స్ సిద్ధం. వీటిని టమాటా సాస్ లేదా మయోనీస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. మసాలాలు కొద్దిగా తగ్గించి వాడితే పిల్లలకు కూడా నచ్చుతాయి. ఇంకెందుకు లేట్ ఈ న్యూయర్‌కి వెరైటీగా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతాయి.