ఉదయాన్నే ఖాళీ కడుపుతో గిన్నెడు తింటే చాలు.. ఏనుగు లాంటి బలం.. రోజంతా ఫుల్ ఎనర్జీ..

పెసలు ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలతో కూడిన ఆహారం. ఉదయాన్నే ఉడికించిన పెసలు లేదా మొలకలు తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి, జీర్ణక్రియకు తోడ్పాటు వంటి ప్రయోజనాలు పొందవచ్చు. పెసలను ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసంతో రుచికరమైన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గిన్నెడు తింటే చాలు.. ఏనుగు లాంటి బలం.. రోజంతా ఫుల్ ఎనర్జీ..
Green Gram Benefits

Updated on: Sep 04, 2026 | 9:08 AM

పెసలు శరీరానికి అవసరమైన పోషకాలతో నిండిన అద్భుతమైన పోషకాహారం.. ఉదయం పూట తీసుకునే ఆహారం రోజంతా మన శక్తి స్థాయిలను, ఉత్సాహాన్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో, పెసర్లు అద్భుతమైన, బలమైన ఆహారంగా నిలుస్తాయి. మొక్కల నుంచి లభించే పెసర్లు ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పెసలులో (Green Gram / Moong Bean) B-కాంప్లెక్స్ (బి1, బి9/ఫోలేట్), విటమిన్ C, విటమిన్ E సమృద్ధిగా ఉండటంతోపాటు.. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్ కూడా ఉంటాయని వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యానికి పెసలు..

కండరాల బలానికి, శరీర పెరుగుదలకు ఇది బాగా సహాయపడుతుంది.. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. మలబద్ధకాన్ని నివారిస్తుంది.. ఉదయాన్నే ఒక గిన్నెడు ఉడికించిన పెసర్లు, లేదా.. మొలకలు, పేసర్లకు సంబంధించిన ఫుడ్ తినడం వల్ల రోజంతా పూర్తి శక్తితో, ఉత్సాహంగా ఉండవచ్చు.

బరువు తగ్గడానికి..

పెసర్లు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, తద్వారా అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి, వ్యాయామం చేసేవారికి ఇది ఒక సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది.. ఎందుకంటే ఇది కండరాల ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.

ఉదయం ఉద్యోగానికి వెళ్లేవారు లేదా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు పెసర్లు తినడం వల్ల రోజంతా ఏకాగ్రతతో, శక్తివంతంగా ఉండగలరు. వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇలా సిద్ధం చేసుకోండి..

పెసర్లను మరింత రుచికరంగా చేసుకోవడానికి, ఉడికించిన పెసళ్లలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం కలిపి తినవచ్చు. ఈ విధానంలో నూనె వాడరు కాబట్టి, ఇది ఆహార నియమాలను (డైట్) పాటించే వారికి కూడా అనువైనది. ఆరోగ్యకరమైన, శక్తివంతమైన రోజు కోసం పెసర్లు తినడాన్ని అలవాటు చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us