Kitchen Hacks: ఇడ్లీ పిండి పులిసిందని పడేస్తున్నారా.. ఇలాచేస్తే మళ్లీ యూజ్ చేయచ్చు..

ప్రతీ ఇంట్లో కామన్‌గా చేసే బ్రేక్ ఫాస్ట్‌లలో ఇడ్లీలు, దోశలు ఉంటాయి. చాలా వరకు ఇడ్లీలు, దోశలు ఇష్ట పడి మరీ తింటారు. అందులోనూ సాంబార్ ఇడ్లీ అంటే లొట్టలేసుకుంటూ లాగిస్తారు. పొడులు, టమాటా చట్నీతో తింటే ఆహా అనాల్సిందే. వీటితో ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇంట్లో పిండి తయారు చేసిన తర్వాత ఒక్కోసారి ఇడ్లీ పిండి, దోశ పిండి పులిసి పోతుంది. దీంతో ఇడ్లీలు అస్సలు బాగోవు. పుల్లగా ఉండి..

Kitchen Hacks: ఇడ్లీ పిండి పులిసిందని పడేస్తున్నారా.. ఇలాచేస్తే మళ్లీ యూజ్ చేయచ్చు..
Kitchen Hacks
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2024 | 9:30 PM

ప్రతీ ఇంట్లో కామన్‌గా చేసే బ్రేక్ ఫాస్ట్‌లలో ఇడ్లీలు, దోశలు ఉంటాయి. చాలా వరకు ఇడ్లీలు, దోశలు ఇష్ట పడి మరీ తింటారు. అందులోనూ సాంబార్ ఇడ్లీ అంటే లొట్టలేసుకుంటూ లాగిస్తారు. పొడులు, టమాటా చట్నీతో తింటే ఆహా అనాల్సిందే. వీటితో ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇంట్లో పిండి తయారు చేసిన తర్వాత ఒక్కోసారి ఇడ్లీ పిండి, దోశ పిండి పులిసి పోతుంది. దీంతో ఇడ్లీలు అస్సలు బాగోవు. పుల్లగా ఉండి.. పెద్దగా తినాలని అనిపించదు. దీంతో చాలా మంది ఇడ్లీ పిండి, దోశ పిండిని పారేస్తూ ఉంటారు. ఇలా పారేస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. అందులోనూ మినప గుళ్లు, ఇడ్లీ రవ్వ ఖరీదు కూడా ఎక్కువ. అలా పారేయకుండా పులిసిన పిండిని కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్ని చిట్కాలు ట్రై చేశారంటే నార్మల్ చేసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం – పచ్చి మిర్చి పేస్టు:

ఇడ్లీ పిండి పులిస్తే ఈ పులుపును తగ్గించుకోవచ్చు. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులిస్తే.. వీటిలో అల్లం, పచ్చి మిర్చి కలిపి పేస్టులా చేసి కలపాలి. దీంతో పులుపు తగ్గుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీలు కారంగా ఉంటాయి. కాబట్టి.. రొట్టెలుగా వేసుకోవచ్చు. దోశ పిండి అయినా అంతే.

పంచదార లేదా బెల్లం కలపండి:

దోశ పిండి, ఇడ్లీ పిండి పులిస్తే.. ఇందులో పంచదార లేదా బెల్లం కలపవచ్చు. ఇలా చేయడం వల్ల పులుపు అనేది తగ్గుతుంది. మరీ ఎక్కువగా కాకుండా పులుపు తగ్గేంత వరకు కలపొచ్చు. మరీ ఎక్కువైతే తియ్యగా ఉంటాయి. కాబట్టి పిండి పరిమాణం బట్టి ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

బియ్యం పిండి:

దోశ పిండి, ఇడ్లీ పిండి పులిచినప్పుడు పడేయకుండా బియ్యం పిండి కలిపినా పులుపు తగ్గుతుంది. బియ్యం పిండి కలపడం వల్ల పెద్దగా రుచిలో ఏమాత్రం తేడా రాదు. అయితే ఇడ్లీలు, దోశలు గట్టిగా వస్తే.. కొద్దిగా వంట సోడా కలిపి ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల పులుపు తగ్గి ఇడ్లీలు, దోశలు రుచిగా ఉంటాయి. పిండి కూడా పడేయాల్సిన అవసరం ఉండదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో