నిమ్మ వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు సౌందర్యపరంగా కూడా ఎన్నో లాభాలున్నాయి. అందుకే ముఖవర్ఛస్సుని ఇనుమడింపజేసుకోవడానికి వేసుకునే ఫేషియల్స్ ప్రతి పనిలోనూ నిమ్మరసాన్ని ఉపయోగిస్తుంటారు
TV9 Telugu
నిమ్మలో సహజసిద్ధమైన క్లెన్సింగ్ గుణాలు ఉంటాయి. వీటి వల్ల చర్మం బాగా శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నిమ్మచెక్కను తీసుకుని ట్యాన్ ఉన్న చోట రోజూ 5 నిమిషాల పాటు బాగా రుద్దితే ట్యాన్ తగ్గుముఖం పడుతుంది
TV9 Telugu
ప్రతి రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు తగ్గుతుంది. ఈ డిటాక్స్ డ్రింక్ బరువును తగ్గించడమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది
TV9 Telugu
లెమన్ వాటర్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఈ పానీయం చర్మం మంటను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది
TV9 Telugu
నిమ్మరసంలోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. లెమన్ వాటర్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మారి, ముడతలు రాకుండా ఉంటుంది
TV9 Telugu
రోజూ లెమన్ వాటర్ తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే చర్మం కూడా మెరుగ్గా ఉంటుంది. చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు
TV9 Telugu
నిమ్మరసం నీరు నిర్విషీకరణలో సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. దీని వల్ల మచ్చలు లేని మెరిసే చర్మాన్ని సులభంగా పొందవచ్చు
TV9 Telugu
లెమన్ వాటర్ చర్మం pH ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు, మొటిమలు, మంటలు రావు. ఇది చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తుంది. ప్రకాశాన్ని పెంచుతుంది