పొద్దుపొద్దున్నే కాసిన్ని తేనీటి చుక్కలు గొంతు తడపకపోతే ఏదో లోటుగా ఉంటుంది. కాఫీ, టీ ఏదో ఒకటి కడుపులో పడేస్తేనే హాయిగా ఉంటుందని భావిస్తాం. వీటికి బదులుగా ఉదయం గ్రీన్ టీని తాగారనుకోండి.. ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు
TV9 Telugu
పైగా నేటి రోజుల్లో బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీని తాగుతున్నారు. అయితే ఈ టీని ఎలా తాగాలో చాలా మందికి తెలియదు. గ్రీన్ టీ క్యాన్సర్, అల్జీమర్స్, స్ట్రోక్ మరియు డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీ చర్మం వృద్ధాప్యాన్ని నివారిస్తుంది
TV9 Telugu
కొందరు రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగుతుండగా, మరికొందరు 5-6 కప్పుల వరకు తాగుతున్నారు. ఆరోగ్యానికి మంచిది కదా అని దీనిని అతిగా తీసుకున్నా ప్రమాదమే
TV9 Telugu
మరైతే రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్ టీ తాగాలి? అనే సందేహం మీకూ ఉందా? ఇక్కడ తెలుసుకుందాం.. గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. రెండు భారీ భోజనాల మధ్య గ్రీన్ టీని తీసుకోవాలి. అప్పుడే గ్రీన్ టీ పని చేస్తుంది
TV9 Telugu
అలాగే భారీ భోజనం తిన్న రెండు గంటల ముందు లేదా రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తీసుకోవాలి. బరువు తగ్గాలంటే భోజనం తీసుకోవడానికి ముందు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది
TV9 Telugu
రోజంతా కప్పులు మీద కప్పులు గ్రీన్ టీ తాగాల్సిన అవసరం లేదు. గ్రీన్ టీని రోజుకు 3-5 సార్లు తాగొచ్చు. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి కలుగుతుంది
TV9 Telugu
అందరూ గ్రీన్ టీ తాగవచ్చు. ఇది శరీరంలోని అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే బరువును అదుపులో ఉంచుకోవచ్చు
TV9 Telugu
అయితే అజీర్ణం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడేవారు గ్రీన్ టీని అస్సలు తాగకూడదు. అదే విధంగా గర్భధారణ సమయంలో కూడా గ్రీన్ టీకి దూరంగా ఉండాలి