29 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
చాలా మందికి బాత్రూమ్ కు వెళ్తూ తమ వెంట మొబైల్స్ తీసుకెళ్తారు. అయితే టాయిలెట్‌లో కూర్చుని మొబైల్ చూసే అలవాటు ఉంటే కష్టమైనా ఈరోజే ఆపేయండి.
ఎందుకంటే ఈ రకమైన అలవాటు తో మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది, జాగ్రత్త సుమా.. అవును ఈ అలవాటు ఎవరికీ మంచిది కాదు.
టాయిలెట్‌లో మొబైల్ వాడటం వలన సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు దీని వలన పైల్స్ సమస్య వస్తుంది.
టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, ఎందుకంటే టాయిలెట్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.
టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్లడంతో దానికి బ్యాక్టీరియా అంటుకుంటుంది. చేతులు శుభ్రం చేసుకుంటారు. అయితే మొబైల్‌ను కడగరు. దీంతో అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది.
టాయిలెట్‌లో కూర్చుని ఫోన్ చూడడం వల్ల సమయం తెలియదు. ఎక్కువసేపు కూర్చుని ఉంటే పాయువు, పురీషనాళ కండరాల, నరాలపై ఒత్తిడి పెంచుతుంది.
టాయిలెట్ లో ఫోన్ వాడితే డయేరియా, పేగు సంబంధిత వ్యాధులు, మూత్ర వ్యాధులు, కొన్ని రకాల అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం