Morning Exercise: ఖాళీ కడుపుతో పరిగెత్తడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నిపుణులు ఏమి చెప్పారంటే..

|

Sep 04, 2024 | 8:21 PM

రన్నింగ్ వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుందని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ ఎండీ-ఫిజిషియన్ డాక్టర్ రవి కేసరి చెప్పారు. రక్త ప్రసరణ సజావుగా సాగితే శరీరం అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. నిపుణులు ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Morning Exercise: ఖాళీ కడుపుతో పరిగెత్తడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నిపుణులు ఏమి చెప్పారంటే..
Exercise Benefits
Image Credit source: pexels
Follow us on

శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే రన్నింగ్ చేయండి. రన్నింగ్ వల్ల శరీరంలో స్టామినా పెరుగుతుంది. క్రీడాకారులు, అథ్లెట్లు ఎక్కువగా ఖాళీ కడుపుతో నడుస్తారు. నిజానికి రన్నింగ్ శరీరం శక్తిని పెంచుతుంది. కొవ్వు కూడా వేగంగా కరిగిపోతుంది. ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో పరిగెత్తితే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. రన్నింగ్ వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుందని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ ఎండీ-ఫిజిషియన్ డాక్టర్ రవి కేసరి చెప్పారు. రక్త ప్రసరణ సజావుగా సాగితే శరీరం అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. నిపుణులు ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

కొవ్వు వేగంగా కరిగిపోతుంది

బరువు తగ్గాలనుకునే వారు ఖాళీ కడుపుతో పరుగెత్తాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం తినకుండా పరుగెత్తడం వల్ల కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఇందుకు సంబంధించి అనేక పరిశోధనలు కూడా వెలుగులోకి వచ్చాయి. శరీరంలోని అదనపు కొవ్వు కరిగించుకోవడానికి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు పరిగెత్తవచ్చు.

మధుమేహం అదుపులో ఉంటుంది

రన్నింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. అంతే కాకుండా ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల జీవక్రియలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రన్నింగ్ వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం పరుగెత్తడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గుండె జబ్బులకు మేలు

గుండె జబ్బుల ప్రమాదం తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాలు పరుగెత్తండి. ఇలా చేయడం వలన గుండె పని తీరు మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

మంచి నిద్ర

బాగా పరుగెత్తే వారి శరీరం అలసి పోయి బాగా నిద్రపోతారు. ప్రత్యేకించి రాత్రంతా మంచంపై ఎగిరి గంతులేస్తూ ఉండే వారికి పరుగు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం పరుగెత్తడం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. మొత్తంమీద ఖాళీ కడుపుతో పరుగెత్తడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note:పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం