Lifestyle: పాలతో పాటు ఈ ట్యాబ్లెట్స్‌ను వేసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అయితే పాలను కొన్ని రకాల వస్తువులతో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలను కొన్ని రకాల ట్యాబ్లెట్స్‌ను కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: పాలతో పాటు ఈ ట్యాబ్లెట్స్‌ను వేసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
Milk
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 12, 2024 | 9:21 AM

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అయితే పాలను కొన్ని రకాల వస్తువులతో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలను కొన్ని రకాల ట్యాబ్లెట్స్‌ను కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పాలు తాగిన వెంటనే ఎలాంటి ట్యాబ్లెట్స్‌ వేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

* పాలు తాగిన వెంటనే ఐరన్ సప్లిమెంట్స్ మాత్రలు వేసుకోకూడదని నిపుణులు అంటున్నారు. రక్తంలో ఐరన్‌ లోపం ఉన్నప్పుడు ఉపయోగించే ఈ ట్యాబ్లెట్స్‌ను పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ పాలు తాగితే కనీసం రెండు గంటల తర్వాత మాత్రమే మందులు వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* హైపోథైరాయిడిజంతో బాధపడేవారు తీసుకునే లెవోథైరాక్సిన్, ఆర్మర్ థైరాయిడ్, లియోథైరోనిన్ (సైటోమెల్) వంటి మందులు తీసుకునే వారు కూడా వెంటనే పాలు తాగకూడదు. వీటివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. పాలు తాగే ముందు, తర్వాత కనీసం 4 గంటల గ్యాప్‌ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

* యాంటీబయాటిక్స్‌ ట్యాబ్లెట్స్‌ వేసుకునే ముందు, తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌, మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలకు మందులను వాడే వారు పాలు తీసుకోకూడదని చెబుతున్నారు.

* ఎముకల ఆరోగ్యానికి ఉపయోగించే బిస్ఫాస్ఫోనేట్ వంటి ట్యాబ్లెట్స్‌ను ఉపయోగించే వారు కూడా పాలు తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ మందులు తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత పాలు తాగితే ఆ మందుల ప్రభావం ఉండదని అంటున్నారు. కనీసం గంట అయినా గ్యాప్‌ తీసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పాలతో పాటు ఈ ట్యాబ్లెట్స్‌ను వేసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలతో పాటు ఈ ట్యాబ్లెట్స్‌ను వేసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
ప్రమాదంలో విమానం.. 2 గంటలకుపైగా గాల్లో చక్కర్లు! వీడియో
ప్రమాదంలో విమానం.. 2 గంటలకుపైగా గాల్లో చక్కర్లు! వీడియో
దసరా రోజునే తెరచుకుని ఆలయం.. రావణుడికి ప్రత్యేక పూజలు.. 
దసరా రోజునే తెరచుకుని ఆలయం.. రావణుడికి ప్రత్యేక పూజలు.. 
నాన్నే స్ఫూర్తి.. రతన్ టాటా తండ్రి ప్రస్థాన మిది..
నాన్నే స్ఫూర్తి.. రతన్ టాటా తండ్రి ప్రస్థాన మిది..
నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్‌పై కిషన్‌ రెడ్డి క్లారిటీ..
నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్‌పై కిషన్‌ రెడ్డి క్లారిటీ..
మరో 2 రోజుల్లో TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
మరో 2 రోజుల్లో TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు.. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం
బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు.. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం
ఇత్తడి విగ్రహాలను, వస్తువులను ఇలా క్లీన్ చేస్తే మెరిసి పోతాయి..
ఇత్తడి విగ్రహాలను, వస్తువులను ఇలా క్లీన్ చేస్తే మెరిసి పోతాయి..
రూ.లక్షకు 14వేలు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..!
రూ.లక్షకు 14వేలు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..!